Kharif Season | హైదరాబాద్ : ఈ వనకాలం (ఖరీఫ్) సీజన్‌లో తెలంగాణలో పంటల సాగు తీవ్రంగా పడిపోయింది.మొత్తం పంట విస్తీర్ణం దాదాపు 1.23 కోట్ల ఎకరాలకే పరిమితమైంది. గత ఏడాది ఇదే కాలంలో 1.29 కోట్ల ఎకరాల సాధారణ విస్తీర్ణంలో 1.28 కోట్ల ఎకరాల్లో సాగు చేశారు. సీజన్ ముగియడానికి ఇంకా రెండు వారాల కంటే తక్కువ సమయం ఉంది. మొత్తం పంట విస్తీర్ణం ఇప్పటికిప్పుడు మెరుగుపడే అవకాశం లేదు.
గతేడాది సమయానికి పంటలకు సరిపడా సాగునీరు, రైతుబంధు వ్యవసాయ పెట్టుబడి అందడంతో. వ్యవసాయ సాగు వృద్ధికి ఊతమిచ్చింది. గత సంవత్సరాలతో పోల్చినప్పుడు, కోవిడ్ అనంతర కాలంలో వనకాలం సీజన్‌లో ఈసారి అత్యల్పంగా విస్తీర్ణం నమోదైంది. సెప్టెంబరు 12 నాటికి 1.23 కోట్ల ఎకరాల్లో మాత్రమే నాట్లు పూర్తయ్యాయి. వనాకాలం సీజన్‌లో సాధారణ సాగు విస్తీర్ణం సుమారు 1.29 కోట్ల ఎకరాల్లో 95 శాతం ఉండేది. గతేడాది 1.28 కోట్ల ఎకరాల్లో నాట్లు పూర్తికాగా, ఈసారి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ప్రధాన పంటలైన వరి, పత్తి, పప్పుధాన్యాల సాగు తీవ్రంగా దెబ్బతిన్నది.
సాగునీటి సరఫరాపై అనిశ్చితి, రైతు భరోసా పెట్టుబడి మద్దతు లేకపోవడం.. పరిమిత పంట రుణాల పంపిణీ దీనికి కారణమని రైతులు చెబుతున్నారు. ఈ కష్టాలకు తోడు ఇటీవలి కాలం (Kharif Season)లో భారీ వర్షాల వల్ల 20 లక్షల ఎకరాలకు పైగా పంటలు పూర్తిగా లేదా పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇది మొత్తం పంట ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సర్వత్రా అందోళన వ్యక్తమవుతోంది. చెరకు, వరి, పప్పుధాన్యాలు, ప్రధాన మినుములు, నూనెగింజలు, పత్తి పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. సాగు తక్కువ కాలం ఉండడంతో సీజన్‌లో చివరి నెలలో ఎక్కువగా విత్తిన వరి, గత వనాకాలం సీజన్‌లో 62 లక్షల ఎకరాల్లో సాగైన వరి ప్రస్తుత సీజన్‌లో 59 లక్షల ఎకరాలకు తగ్గింది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..