భారతదేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన దిగ్గజం bajaj auto (బజాజ్ ఆటో లిమిటెడ్..) తాజాగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం కొన్ని ప్రతిష్టాత్మక ప్లాన్‌లను ప్రకటించింది. మహారాష్ట్రలోని అకుర్డి (పుణె)లో కొత్త ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ నిర్మాణం కోసం అలాగే ఎగుమతుల కోసం రూ. 300 కోట్లు (USD 40 మిలియన్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ గురువారం ప్రకటించింది. వాస్తవానికి, బజాజ్ ఇప్పటికే తన సరికొత్త తయారీ కేంద్రం వద్ద వర్క్‌ను ప్రారంభించింది. ఈ యూనిట్లో సంవత్సరానికి 5,00,000 ఎలక్ట్రిక్ స్కూటర్‌ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని పేర్కొంది. జూన్ 2022 నాటికి ఈ కొత్త పరిశ్రమ నుంచి మొదటి ఎలక్ట్రిక్ వాహనం విడుదల కానుంది.
బజాజ్ ఆటోను భారతదేశంలో ఇంటి పేరుగా మార్చిన అసలైన చేతక్ స్కూటర్ కర్మాగారం కూడా అకుర్ది (పుణే) అని కంపెనీ పేర్కొనడం విశేషం. బజాజ్ కొత్త EV తయారీ కర్మాగారం.. అర మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. ఈ పరిశ్రమలో సుమారు 800 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. కంపెనీ చెబుతున్న దాని ప్రకారం ఈ “కొత్త యూనిట్ లాజిస్టిక్స్, మెటీరియల్ హ్యాండ్లింగ్, ఫ్యాబ్రికేషన్, పెయింటింగ్, అసెంబ్లీ హామీతో సహా ప్రతిదానికీ అత్యాధునిక రోబోటిక్, ఆటోమేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
కొత్త EV తయారీ యూనిట్ గురించి Bajaj auto లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ మాట్లాడుతూ.. “2001లో బజాజ్ 2.0 రోరింగ్ పల్సర్‌పై బయలుదేరిందని తెలిపారు. 2021లో బజాజ్ 3.0 మనోహరమైన చేతక్‌లో వచ్చిందని తెలిపారు. బజాజ్ పోర్ట్‌ఫోలియో కోసం ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న ఒక అత్యాధునిక ICE ప్లాట్‌ఫారమ్‌ను అమలు చేయడం మినహా, మా అన్ని R&D వనరులు ఇప్పుడు భవిష్యత్తు కోసం EV సొల్యూషన్‌లను రూపొందించడంపై దృష్టి కేంద్రీకరించాయని పేర్కొన్నారు.
మరిన్ని అప్‌డేట్‌ల కోసం హరితమిత్ర వెబ్‌సైట్‌ను సందర్శించండి.. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన వీడియోల కోసం మా Haritha mithra YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి..!