Saturday, December 7Lend a hand to save the Planet
Shadow

హైద‌రాబాద్‌లో Battery Swap Station

Spread the love

HPCL, RACEnergy భాగ‌స్వామ్యంతో ఏర్పాటు

Battery Swap Station : ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అయిన RACEnergy, భారతదేశంలోని అతిపెద్ద ఇంధన సంస్థల్లో ఒకటైన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)తో జ‌ట్టు క‌ట్టింది. ఈ రెండు సంస్థ భాగ‌స్వామ్యంతో హైదరాబాద్‌లో తన మొదటి బ్యాటరీ స్వాప్ స్టేషన్‌ను బుధ‌వారం ప్రారంభించింది. ఎల‌క్ట్రిక్ టూ వీల‌ర్‌, త్రీ వీల‌ర్ వాహ‌నాల కోసం వీటిని న‌గ‌ర వ్యాప్తంగా ఏర్పాటు చేయ‌నున్నారు. పరిశ్రమలు & వాణిజ్యం (I&C), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగాల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ఇటీవ‌ల IKEA ఎదురుగా ఉన్న HITEC సిటీలో మొదటి స్టేషన్‌ను RACEnergy CTO, సహ వ్యవస్థాపకుడు గౌతం మహేశ్వరన్ ప్రారంభించారు.

RACEnergy-Battery-Swap-Station

హైద‌రాబాద్ నగరంలోని ప్రధాన ప్రదేశాలలో ఉన్న‌ HPCL అవుట్‌లెట్‌లలో మూడు బ్యాటరీ స్వాప్ స్టేషన్‌లను జనవరి 2022లో ఏర్పాటు చేయ‌నున్నారు. ఎలక్ట్రిక్ టూ వీల‌ర్, త్రీ కోసం బ్యాటరీ స్వాపింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నెట్‌వర్క్‌ను సెటప్ చేయాలని RACEnergy సంస్థ ముందుక సాగుతోంది.

మొట్ట‌మొద‌టి Battery Swap Station  ఏర్పాటు చేసిన సంద‌ర్భంగా  RACEnergy CTO, సహ వ్యవస్థాపకుడు గౌతమ్ మహేశ్వరన్ మాట్లాడుతూ.. “HPCL ఈ-మొబిలిటీ రంగంలో సాహసోపేతమైన పురోగతిని కొనసాగిస్తున్నందున, దానితో భాగ‌స్వామ్యం కుదుర్చుకోవ‌డం సంతోషంగా ఉంద‌ని తెలిపారు. వారి రిటైల్ అవుట్‌లెట్‌లలో మా బ్యాటరీ స్వాప్ స్టేషన్‌లను ఏర్పాటు చేసుకోవ‌డానికి త‌మకు అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అని పేర్కొన్నారు.

“ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేయడానికి బలమైన స్వాపింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవసరం. HPCL రిటైల్ అవుట్‌లెట్‌ల నెట్‌వర్క్ వ‌ల్ల రాష్ట్రంలోని ప్రతి మూలకు సులభంగా చేరుకోవడానికి మాకు వీలు కల్పిస్తుంది” అని RACEenergy CEO, సహ వ్యవస్థాపకుడు అరుణ్ శ్రేయస్ అన్నారు.

రెండు నిమిషాల్లోనే బ్యాట‌రీ మార్పిడి

RACEnergy తయారు చేసిన Battery Swap Station , స్వాప్ చేయగల బ్యాటరీలు పొదుపుగా , స్కేలబుల్‌గా ఉండే చక్కటి సమగ్ర పరిష్కారాన్ని అందిస్తాయి. ఇందులో డ్రైవర్‌లు తమ డిశ్చార్జ్ అయిన బ్యాటరీలను 2 నిమిషాలలోపు ఛార్జ్ చేసిన వాటితో మార్చుకోవచ్చు. దీని వ‌ల్ల బ్యాట‌రీల‌ను చార్జింగ్ చేసుకునే విలువైన స‌మ‌యం ఆదా అవుతుంది.

రిట్రో ఫిట్ కిట్‌లు..

పెట్రోల్ వాహనాలను తన ప్లాట్‌ఫారమ్‌లోకి తీసుకురావడానికి RACEnergy ఇప్పటికే ఉన్న ICE ఆటో-రిక్షాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే రెట్రోఫిట్ కిట్‌లను అందిస్తోంది. ఇది బ్యాటరీ స్వాప్ నెట్‌వర్క్‌కు అనుకూలంగా ఉంటుంది.

మరిన్ని అప్‌డేట్‌ల కోసం హ‌రిత‌మిత్ర వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.. ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు సంబంధించిన వీడియోల కోసం మా  Haritha mithra YouTube ఛానెల్‌ను స‌బ్‌స్క్రైబ్ చేసుకోండి..!

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *