Home » EVTRIC నుంచి 3 హైస్పీడ్ ఎలక్ట్రిక్ వాహనాలు

EVTRIC నుంచి 3 హైస్పీడ్ ఎలక్ట్రిక్ వాహనాలు

Spread the love

EVTRIC Electric scooters : ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ అయిన EVTRIC మోటార్స్ సంస్థ కొత్త‌గా  3 ఎల‌క్ట్రిక్ ద్విచ‌క్ర‌వాహ‌నాల‌ను విడుద‌ల చేసింది.  గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్‌లో ఇటీవ‌ల జరిగిన EV ఇండియా ఎక్స్‌పో 2021లో EVTRIC రైజ్, EVTRIC మైటీ, అలాగే EVTRIC రైడ్ ప్రో అనే మూడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ప్రదర్శించింది.

EVTRIC electric scooters

భారతదేశంలో 70+ పంపిణీదారుల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసినట్లు కంపెనీ పేర్కొంది.  ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు 150 డిస్ట్రిబ్యూటర్ల ల‌క్ష్యాన్ని చేరుకోవాలని కంపెనీ ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేసుకుంది. 2021-22 లో తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా తోపాటు పశ్చిమ బెంగాల్‌లో విస్త‌రించి ఉంది.

EVTRIC Rise

EVTRIC సంస్థ తీసుకొస్తున్న వాహ‌నాల్లో ఇది మొదటి మోటార్‌సైకిల్. హై స్పీడ్ వాహ‌నం ఇందులో 3.0 kWh లిథియం-అయాన్ బ్యాట‌రీని వినియోగించారు. ఇది డిటాచ‌బుల్‌. గంట‌కు 100 కి.మీ వేగంతో దూసుకెళ్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 120 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్ర‌యాణిస్తుంద‌ని కంపెనీ తెలిపింది.

EVTRIC మైటీ

EVTRIC మైటీ కూడా  హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది  బ్లింగ్/ కంఫర్ట్ మిక్స్‌ని అందిస్తుందని పేర్కొంది. ఇది గరిష్టంగా గంటకు 70 కి.మీ వేగంతో వెళ్తుంది. సింగిల్ చార్జిపై 90 కిలోమీట‌ర్ల‌వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంది.

EVTRIC రైడ్ ప్రో

EVTRIC సంస్థ ఆవిష్కరించబడిన మరొక హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ EVTRIC  రైడ్ ప్రో. ఈ వాహ‌న వేగం గంట‌కు 75 కిలోమీట‌ర్లు. అలాగే ఒక్క‌సారి చార్జ్ చేస్తే 90 కిలోమీట‌ర్ల వ‌ర‌కు ప్ర‌యాణించ‌వ‌చ్చు. EVTRIC రైడ్ ప్రో అనేది 2021 ఆగస్టులో మార్కెట్లోకి ప్రవేశించిన EVTRIC రైడ్ ఎల‌క్ట్రిక్ స్కూటర్  అధునాతన వెర్షన్.

స‌రికొత్త EVTRIC Electric scooters లాంఛ్ విష‌య‌మై EVTRIC మోటార్స్ వ్యవస్థాపకుడు & MD మనోజ్ పాటిల్ మాట్లాడుతూ.. మార్కెట్ పరిశోధన, కస్టమర్ ఫీడ్‌బ్యాక్ ను దృష్టిలో పెట్టుకొని ఈ  ప్రొడ‌క్ట్‌ల‌ను రూపొందించామ‌ని పేర్కొన్నారు.

కస్టమర్ మైండ్‌సెట్‌ను నిజాయితీగా పరిగణనలోకి తీసుకోకపోతే, పరిశ్రమ యొక్క మొత్తం వృద్ధి రేటు దెబ్బతింటుంద‌ని తెలిపారు.  అందువల్ల తాము కస్టమర్ ఫస్ట్ బ్రాండ్, ప్రత్యేకమైన ఫీచర్లు, ఆకర్షించే డిజైన్ తోపాటు చక్కటి సాంకేతికత పరంగా అంచనాలకు అనుగుణంగా వాహ‌నాల‌ను అందిస్తున్నామ‌ని మ‌నోజ్ పాటిల్ పేర్కొన్నారు.

 

3 thoughts on “EVTRIC నుంచి 3 హైస్పీడ్ ఎలక్ట్రిక్ వాహనాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates