Bajaj Chetak 3202 | బజాజ్ ఆటో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. చేతక్ బ్లూ 3202 అని పిలవబడే ఈ కొత్త వేరియంట్ ధర రూ. 1.15 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా పేర్కొంది. ఇటీవలే విడుదలైన చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్ కంటే రూ. 14,000 తక్కువ ధరకే విడుదల చేసింది. ఈ స్కూటర్ రాబోయే కొద్దిరోజుల్లో ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.
కొత్త చేతక్ బ్లూ 3202 బ్రూక్లిన్ బ్లాక్, సైబర్ వైట్, ఇండిగో మెటాలిక్, మాట్ గ్రే వంటి నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంటుంది దీని కోసం ప్రస్తుతం అధికారిక చేతక్ వెబ్‌సైట్‌లో రూ. 2,000 టోకెన్ మొత్తానికి బుకింగ్‌లను కంపెనీ ప్రారంభించింది. స్టాండర్డ్ బజాజ్ చేతక్ రెండు ట్రిమ్‌లలో అందిస్తున్నారు. అవిఅర్బనే, ప్రీమియం.
Bajaj Chetak 3202 లో కొత్తదనం ఏముంది?
చేతక్ బ్లూ 3202 వేరియంట్ బజాజ్ ప్రీమియం వేరియంట్ మాదిరిగానే అదే 3.2 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే.. ఇది ప్రీమియం వేరియంట్ కంటే రేంజ్ ఎక్కువ ఇస్తుంది. ఇది ఒక్క చార్జిపై 137 కి.మీ ప్రయాణిస్తుంది. చేతక్ ప్రీమియం ధర రూ. 1.47 లక్షలు కాగా ఇది ఫుల్ ఛార్జీపై 126 కి.మీ రేంజ్ ఇస్తుంది. చేతక్ బ్లూ 3202 వేరియంట్‌లో కొత్తగా సేకరించిన బ్యాటరీ సెల్‌లు అధికంగా రేంజ్ ఇవ్వడానికి కారణమవుతుంది.
చేతక్ యొక్క ఇతర వేరియంట్‌ల మాదిరిగానే, ఇది కూడా అదనపు ధరతో TecPac ప్యాకేజీతో అందిస్తున్నారు. ఇది హిల్-హోల్డ్ అసిస్టెంట్, రోల్-ఓవర్ డిటెక్షన్, అదనపు రైడింగ్ మోడ్‌లు స్పోర్ట్, క్రాల్ వంటి ఫీచర్‌లను కలిగి ఉంటుంది. ఈ వేరియంట్‌లో ఆఫర్‌లో ఉన్న ఇతర ముఖ్యమైన ఫీచర్‌లలో LED DRLలతో కూడిన LED హెడ్‌లైట్‌లు, USB ఛార్జింగ్ పోర్ట్, ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్‌లతో బజాజ్ యాప్ ద్వారా ఇంటిగ్రేటెడ్ కనెక్టివిటీ ఎంపికలు ఉన్నాయి.
బజాజ్ చేతక్ బ్లూ 3202: స్పెక్స్
Bajaj Chetak Blue 3202 Specs : బజాజ్ చేతక్ బ్లూ 3202 భారతీయ మార్కెట్లో అథర్ రిజ్టా, ఓలా S1 ఎయిర్, TVS iQube S, Hero Vida V1 వంటి ప్రముఖ బ్రాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. . స్పష్టంగా పేర్కొనబడనప్పటికీ, కొత్త చేతక్ బ్లూ 3202 5,36 bhp మరియు 16 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 4.2 kW హబ్-మౌంటెడ్ PMS మోటారు ద్వారా శక్తిని పొందుతుందని భావిస్తున్నారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..