Bajaj Chetak Blue 3202 vs TVS iQube | ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో సంప్రదాయ ద్విచక్ర వాహన దిగ్గజాల మధ్య పోరు మరింత వేడెక్కుతోంది. TVS మోటార్, బజాజ్ చేతక్ స్కూటర్లు వరుసగా రెండు మూడవ స్థానంలో ఉన్నాయి. బజాజ్ తాజాగా చేతక్ బ్లూ 3202 విడుదల చేయగా , TVS మోటార్స్ iQube 3.4 kWh మిడిల్ రేంజ్ మోడల్ తో మార్కెట్ లో పోటీ పడేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను పోల్చి చూద్దాం.
స్పెసిఫికేషన్‌లు
Bajaj Chetak Blue 3202 vs TVS iQube చేతక్ బ్లూ 3202 ఎలక్ట్రిక్ స్కూటర్ 16 Nm టార్క్‌తో 5.3 bhp తో 3.2 kWh బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది ప్రీమియం వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంది. బజాజ్ ఆటో ప్రకారం EV స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 137 కిమీల రేంజ్‌ను అందిస్తుంది. గరిష్టంగా 63 kmph వేగంతో ప్రయాణిస్తుంది. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 5 గంటల 50 నిమిషాలు పడుతుంది. 5,000 రూపాయలకు టెక్‌ప్యాక్ అందుబాటులో ఉంది. ఇది గరిష్ట వేగాన్ని 73 kmphకి పెంచుతుంది
ఇక టీవీఎస్ iQube ఈవీ విషయానికొస్తే.. ఇది 5.9 bhp, 33 Nm టార్క్ తో 78 kmph గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో 3.4 kWh బ్యాటరీని పొందుపరిచారు. TVS ప్రకారం, ఇది 100 కిమీ రైడింగ్ రేంజ్‌ని అందిస్తుంది. iQube 4.2 సెకన్లలో 0 – 40 kmph వేగాన్ని అందుకుంటుంది.
ఫీచర్లు
స్టాండర్డ్ చేతక్ బ్లూ 3202 కేవలం ఎకో మోడ్‌తో వస్తుంది టెక్‌పాక్ తీసుకుంటే హిల్ హోల్డ్, రివర్స్ మోడ్‌తో పాటు ఎకో, స్పోర్ట్స్ వస్తాయి. ఇది డిజిటల్ కన్సోల్, 12-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రియర్ డ్రమ్, USB ఛార్జింగ్ పోర్ట్, కనెక్ట్ చేయబడిన టెక్నాలజీని కలిగి ఉంది . ఇది నాలుగు రంగులలో లభిస్తుంది అవి బ్రూక్లిన్ బ్లాక్, సైబర్ వైట్, ఇండిగో మెటాలిక్ మరియు మాట్ గ్రే.
టీవీఎస్ ఐక్యూబ్ లో రివర్స్ పార్క్ అసిస్ట్, 220 mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్, 130 mm వెనుక డ్రమ్, USB పోర్ట్, కనెక్టివిటీ ఫీచర్లు వంటి ఫీచర్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది టర్న్-బై-టర్న్ నావిగేషన్, ఇన్‌కమింగ్ కాల్ అలర్ట్‌లు, జియో ఫెన్సింగ్, యాంటీ-థెఫ్ట్ అలర్ట్, లైవ్ లొకేషన్ అప్‌డేట్‌లు, క్రాష్ అండ్ ఫాల్ అలర్ట్‌లతో సహా టెలిమాటిక్స్ ఫంక్షన్‌ను అందిస్తుంది. ఇది షైనింగ్ రెడ్, పెరల్ వైట్, టైటానియం గ్రే గ్లోసీ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.
బజాజ్ చేతక్ బ్లూ 3202 vs TVS iQube: ధరలు
చేతక్ బ్లూ 3202 ధర రూ. 1.15 లక్షలు, ఎక్స్-షోరూమ్ దిల్లీ, TVS iQube ధరను రూ. 21,000కు పైగా తగ్గించింది. TVS EV ధర రూ. 1.36 లక్షలు అయినప్పటికీ, ఇది మరింత శక్తివంతమైనదిగా, ఎక్కువ స్మార్ట్ ఫీచర్లను కలిగి ఉంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..