Bajaj Bruzer CNG Bike | బజాజ్ CNG మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేస్తోందనే విషయం అందరికీ తెలిసిందే.. బజాజ్ సీఎన్జీ బైక్ గురించి స్వయంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ జూన్ 18న ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు బజాజ్ CNG మోటార్‌సైకిల్‌ను రోడ్లపై పరీక్షించడం మొదలుపెట్టారు. అయితే తాజాగా రోడ్లపై బజాజ్ బైక్ మ్యూల్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Bajaj Bruzer CNG Bike : బజాజ్ బ్రూజర్ డిజైన్
బజాజ్ సీఎన్ జీ బైక్ కోసం బ్రూజర్ అనే పేరుతో ట్రేడ్‌మార్క్‌ను దాఖలు చేసింది. బ్రూజర్ ఒక గుండ్రని హెడ్‌ల్యాంప్, ఫ్లాట్ సీటు, పెట్రోల్ కోసం పెద్ద ట్యాంక్‌తో కూడిన రెట్రో డిజైన్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. లీకైన బ్లూప్రింట్‌లు CNGని రైడర్ సీటు కింద ట్యాంక్‌లో ఉంచి, దృఢమైన స్టీల్ పైపుతో ఇంజిన్ కు కనెక్ట్ అయిందని తెలుస్తోంది.
బజాజ్ బ్రూజర్ లేఅవుట్ దాని డిజైన్ పరిశీలిస్తే.. స్లోపర్ ఇంజిన్, పొడవాటి ఫ్లై-స్క్రీన్, హ్యాండ్ గ్రిప్‌ల వంటి స్పోర్టింగ్ భాగాలను చూడవచ్చు, అయితే ఇవి స్టాండర్డ్‌గా అందుబాటులో ఉంటాయా, విభిన్న వేరియంట్‌లుగా అందుబాటులోకి తీసుకువస్తారా లేదా ఆప్షనల్‌గా ఉంటుందా అనేది చూడాల్సి ఉంది.
బ్రూజర్ డ్యూయల్ ఫై-స్పోక్ అల్లాయ్ వీల్ డిజైన్‌తో కూడా చూడవచ్చు, ఇది ఒక జత బ్లాక్-ప్యాటర్న్ టైర్‌లతో ఉంటుంది. బ్రూజర్‌లో ముందు భాగంలో డిస్క్, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్స్ అమర్చబడి ఉన్నాయి. టెలిస్కోపిక్ ఫోర్క్ మోనో-షాక్ సెటప్‌తో అమర్చబడిన బ్రూజర్ గ్రామీణ ప్రాంతాలలోని కఠినమైన రోడ్లపై సులువుగా ప్రయాణించేందుకు వీలుగా అమర్చబడి ఉన్నట్లు అనిపిస్తుంది.
హాలోజన్ ఇండికేటర్‌లు, హెడ్‌లైట్, టెయిల్-ల్యాంప్ LED యూనిట్‌లుగా కనిపిస్తాయి. బజాజ్ ప్రైసింగ్‌లో మాస్టర్ అని మనందరికీ తెలిసిందే.. పల్సర్ NS400Z, ట్రయంఫ్ స్పీడ్ 400 తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. బ్రూజర్ కూడా మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలోనే తీసుకువస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, బ్రూజర్ ప్రస్తుత 125cc లైనప్‌లోనే ఉంటుందని తెలుస్తోంది. ఇంకా బజాజ్ బ్రూజర్ ను ఎప్పుడు లాంచ్ చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..
[…] రోడ్లపై తళుక్కున మెరిసిన కొత్త బజా… […]
[…] […]