తమ డీలర్‌షిప్ నెట్‌వర్క్‌లను సందర్శించి బ్యాటరీ సేఫ్టీ, జాగ్రత్తలపై అవగహన పెంచుకోండని ప్రముఖ ఈవీ తయారీ దిగ్గజం Hero Electric ప్రకటించింది. ఇటీవల కొన్ని కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్‌లు కాలిపోయిన నేపథ్యంలో.. వేసవి కాలం ప్రారంభమవుతున్న దృష్ట్యా ఏప్రిల్ మాసాన్ని బ్యాటరీ సంరక్షణ మాసం ( Battery care month ) గా పాటిస్తామని హీరో ఎలక్ట్రిక్ తెలిపింది.
బ్యాటరీ సంరక్షణ మరియు భద్రతకు సంబంధించిన కీలక అంశాలను తెలుసుకునేందుకు హీరో ఎలక్ట్రిక్ తన 4.5 లక్షల మంది వినియోగదారులకు అవకాశం కల్పించింది. కంపెనీ తన 750 ప్లస్ డీలర్‌షిప్ నెట్‌వర్క్‌లో వారి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను తనిఖీ చేయవచ్చు. ఈ సేవ పూర్తిగా ఉచితమని కంపనీ ట్విట్టర్‌లో పేర్కొంది.
ఈ అంశంపై హీరో ఎలక్ట్రిక్ సీఈవో సోహిందర్ గిల్ మాట్లాడుతూ.. “EV భద్రతకు సంబంధించిన సందేహాలు, ఆందోళనలను నివృత్తి చేయడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే రోడ్డుపై ఉన్న EVల కోసం ఏవైనా దిద్దుబాటు చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ, ఛార్జింగ్ సిస్టమ్ యొక్క నిర్వహణ గురించి అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా 500+ నగరాల్లోని తమ అన్ని డీలర్‌షిప్‌లలో battery care month ను పాటిస్తారు. కస్టమర్‌కు ఎటువంటి ఖర్చు లేకుండా సేవలు అందిస్తామని గిల్ తెలిపారు.