టా కాన్సెప్ట్ కర్వ్ ఎలక్ట్రిక్ కార్ డిజైన్ అదుర్స్..
పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, చిత్రాలు ఇవీ..
టాటా మోటార్స్ బుధవారం టెస్లా, బీఎండబ్ల్యూ కార్లను తలదన్నేలా బుధవారం Tata Curvv electric SUV అనే కొత్త ఎలక్ట్రిక్ SUV కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. ఈ కొత్త మిడ్-సైజ్ SUV ఒక ప్రత్యేకమైన కూపే వంటి డిజైన్ కలిగి ఉంది. వెనుక భాగంలో వాలుగా ఉండే రూఫ్‌లైన్‌ను చూడొచ్చు. కారు పొడవునా పదునైన గీతలు నడుస్తున్నట్లు చూడవచ్చు. బానెట్ muscular look కలిగి ఉంది. టాటా కాన్సెప్ట్ Curvv ముందు భాగంలో LED లైట్ గైడ్ ఉంది. అదే డ్యాష్‌బోర్డ్‌లో అలాగే SUV వెనుక భాగంలోనూ అదే ఎల్ఈడీ లైట్ ఉంది.
Tata Curvv electric SUV స్పెసిఫికేషన్
టాటా మోటార్స్ బ్యాటరీ, మోటారు స్పెసిఫికేషన్‌లకు సంబంధించి ఎటువంటి నిర్దిష్ట సమాచారాన్ని వెల్లడించలేదు. కానీ కాన్సెప్ట్ Curvv అనేది Ziptron ఆర్కిటెక్చర్‌ని ఉపయోగించే ప్రస్తుత వాహనాలతో పోలిస్తే మెరుగైన రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్ సెటప్ వంటి ఫీచర్లు అందిస్తారని ఆశించవచ్చు. ఇది మాత్రమే కాకుండా EV ప్రారంభించిన తర్వాత వాహనం ICE అవతార్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. టాటా మోటార్స్ రాబోయే 2 సంవత్సరాలలో కాన్సెప్ట్ Curvv యొక్క ప్రొడక్షన్-రెడీ వెర్షన్‌ను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Adjustable regenerative braking
టాటా మోటార్ యొక్క జనరేషన్ 2 పోర్ట్‌ఫోలియోలోని అన్ని మోడల్‌లు రీజెనరేటివ్ బ్రేకింగ్‌తో వస్తాయి. రీజెనరేటివ్ బ్రేకింగ్‌ను పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసే ఆప్షన్ కూడా వినియోగదారులకు ఉంటుంది. టాటా మోటార్స్ Curvv కాన్సెప్ట్ వెహికల్-టు-వెహికల్ అలాగే వెహికల్-టు-లోడ్ ఛార్జింగ్ ఫెసిలిటీ కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీని ప్రకారం ఇది ఇతర వాహనాలు లేదా చిన్న విద్యుత్ ఉపకరణాలను ఛార్జ్ చేయగలదని అర్థం.
టాటా Curvv మినిమలిస్టిక్ ఇంటీరియర్‌తో రానుంది. డ్యాష్‌బోర్డ్ పైన రెండు ఫ్లోటింగ్ స్క్రీన్‌లు ఉన్నాయి. ఒకటి MIDగా మరొకటి ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌గా పని చేస్తుంది. ఇరువైపులా బ్యాక్‌లిట్ నియంత్రణలతో కూడిన ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ యూనిట్ ఉంటుంది. ప్రస్తుతం వస్తున్న చాలా వాహనాల మాదిరిగానే, టాటా కర్వ్‌లో కూడా పనోరమిక్ సన్‌రూఫ్ ఉంది. ఇది ఎక్కవ కాంతి వచ్చేలా చేస్తుంది. అలాగే క్యాబిన్‌కు మరింత విశాలమైన అనుభూతిని ఇస్తుంది.
ప్రస్తుత అంచనా ప్రకారం టాటా Curvv కారరు సింగిల్ ఛార్జ్‌కి 400-500 కిమీల పరిధిని అందించగలదని భావిస్తున్నారు.
For more videos visit : Harithamithra
Wonderful