ఇండియాలో అత్యంత తక్కువ ధరల్లో లభ్యమయ్యే ఎలక్ట్రిక్ కార్లు ఇవే..

Spread the love

best budget electric car in india : మహానగరాల్లో సంప్రదాయ పెట్రోల్ వాహనాల వినియోగం మితిమీరిపోవడంతో వాయు కాలుష్యం కూడా ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతోంది. కొద్దిరోజులుగా ఢిల్లీలో వాయు కాలుష్యం భారీ స్థాయికి చేరుకునేలా AQI తీవ్ర స్థాయిని దాటింది. దేశ రాజధాని ప్రాంతంలో తిరిగే BS-4 పెట్రోల్, BS-4 డీజిల్ వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. దీపావళి తర్వాత బేసి-సరి నిబంధనను అమలు చేయనున్నారు. నవంబర్ 13 నుంచి 20 వరకు ఈ నిబంధన ఉంటుంది. పెరుగుతున్న వాయు కాలుష్యానికి చెక్ పెట్టడానికి ఒక మార్గం ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించడం. దురదృష్టవశాత్తు.. EVల వినియోగం ఇప్పటికీ ఇంకా  ప్రారంభ దశలోనే ఉన్నాయి. అందువల్ల, మాస్ మార్కెట్‌లో ఈవీల  ఎంపికలు పరిమితంగానే ఉన్నాయి. పర్యావరణానికి అనుకూలమైన జీరో ఎమిషన్ వెహికల్‌ని సొంతం చేసుకోవాలని ఆలోచించేవారి కోసం మార్కెట్లో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్ల గురించి పూర్తి సమాచారం అందిస్తున్నాం.. పరిశీలించండి.. best budget cheapest electric car in india

MG Motor Comet: రూ 7.98 లక్షలు – రూ 9.98 లక్షలు

best budget electric car in india
MG Comet EV

MG మోటార్ ఈ సంవత్సరం ప్రారంభంలో కాంపాక్ట్ త్రీ-డోర్ కామెట్‌ను విడుదల చేసింది. ఎంజీ మోటర్స్ కంపెనీలో ZS EV తర్వాత దాని పోర్ట్‌ఫోలియోలో ఇది రెండవ Electric Vehicle. కామెట్ 42bhp, 110Nm టార్క్ అవుట్‌పుట్‌తో 17.3 kWh బ్యాటరీతో నడుస్తుంది. ARAI ప్రకారం, కామెట్ ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 230కిమీల రేంజ్‌ను అందిస్తుంది. 3.3 kW ఛార్జర్‌తో, ఇది ఏడు గంటల్లో 0 నుండి 100 శాతం వరకు. అలాగే 5.5 గంటల్లో 0 నుండి 80 శాతం వరకు చార్జ్ అవుతుంది.

Tata Tiago EV: రూ. 8.69 లక్షలు — రూ. 12.04 లక్షలు

Tata Tiago EV

Tata Ev టియాగో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది – 19.2 kWh,  24 kWh. ఎంట్రీ-లెవల్ టియాగో 60.3బిహెచ్‌పి, 110ఎన్ఎమ్ అవుట్‌పుట్ కలిగి ఉండగా, టాప్ ఎండ్ మోడల్ 74బిహెచ్‌పి, 114ఎన్ఎమ్ టార్క్‌ను కలిగి ఉంది. MIDC సైకిల్ ప్రకారం, 19.2 kWh వెర్షన్ 250km పరిధిని అందిస్తుంది. 24kWh బ్యాటరీ వేరియంట్ 350km రేంజ్ ఇస్తుంది. 15A ప్లగ్, AC హోమ్ వాల్ ఛార్జర్‌తో మొదటి వేరియంట్ టియాగో EV 10 నుండి 100 శాతం వరకు 6.9 గంటల్లో చార్జ్ అవుతుంది. అలాగే రెండోది 8.7 గంటల్లో ఫుల్ చార్జ్ అవుతుది. ఇక 7.2 kW ఛార్జర్‌తో, 19.2 kWh వేరియంట్ EV కేవలం 2.6 గంటల్లో 10 – 100 శాతం చార్జ్ అవుతుంది. 24kWh టియాగో DC ఫాస్ట్ ఛార్జర్ విషయంలో 10 -80 శాతం 58 నిమిషాల్లో ఛార్జ్ చేయబడుతుంది.

Citroen eC3: రూ 11.61 లక్షలు – రూ 12.49 లక్షలు

Citroen eC3

Citroen eC3 EV 76bhp, 143Nm టార్క్‌తో 29.2 kW బ్యాటరీతో నడుస్తతుంది.

Citroen కంపెనీ ప్రకారం, ఇది 107km గరిష్ట వేగంతో దూసుకెళ్తుంది.  కేవలం 6.8 సెకన్లలో 0-60 kmph వేగాన్ని అందుకుంటుంది. 15amp ప్లగ్ పాయింట్‌తో, eC3 ఛార్జర్‌లు 10 గంటల 30 నిమిషాల్లో 10 -100 శాతం చార్జ్ అవుతాయి.  DC ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 57 నిమిషాల్లో 10 – 80 శాతం చార్జ్ అవుతుంది. MIDC సైకిల్ ప్రకారం, eC3 320కిమీ పరిధిని అందిస్తుంది.

Tata Tigor EV: రూ. 12.49 లక్షలు — రూ. 13.75 లక్షలు

Tata Tiago EV

Tata Tigor EV మార్కెట్లో అత్యంత పాకెట్ ఫ్రెండ్లీ EV సెడాన్. EV 170Nm టార్క్‌తో 74bhp 26kWh బ్యాటరీ ద్వారా రన్ అవుతుంది. టాటా మోటార్స్ ప్రకారం, ఇది 5.7 సెకన్లలో 0 – 60 kmph వేగాన్ని అందుకుంటుంది. ARAI ఆధారంగా, EV సెడాన్ 315km పరిధిని అందిస్తుంది. ఈ Tata Ev 15 A ప్లగ్ లేదా AC హోమ్ వాల్ ఛార్జర్‌తో 10 నుండి 100 శాతం వరకు పూర్తిగా ఛార్జ్ చేయడానికి 9.4 గంటలు పడుతుంది. ఇక DC ఫాస్ట్ ఛార్జర్‌తో ఇది 59 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.

న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి

Tata Nexon EV: రూ. 14.74 లక్షలు — రూ. 19.94 లక్షలు

best budget electric car in india

Tiago వలె, Nexon EV మీడియం రేంజ్ (MR) అలాగే లాంగ్ రేంజ్ (LR) బ్యాటరీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. మీడియం రేంజ్  MR 123bhp 215Nm తో 30kWh బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 9.2 సెకన్లలో 0 నుండి 100 kmph వేగాన్ని అందుకుంటుంది. MIDC సైకిల్ ప్రకారం 325km పరిధిని కలిగి ఉంటుంది. ఇక లాంగ్ రేంజ్ LR 143bhp, 215Nm అవుట్‌పుట్‌తో పెద్ద 40.5kWh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 8.9 సెకన్లలో 0 నుండి 100 kmph వేగాన్ని అందుకుంటుంది. MIDC సైకిల్ ప్రకారం సింగిల్ చార్జ్ పై 465km పరిధిని అందిస్తుంది. MR వెర్షన్ 15A ప్లగ్ పాయింట్ నుండి 10.5 గంటలలో, 7.2kW AC ఛార్జర్‌తో 4.3 గంటలలో 10 – 100 శాతం ఛార్జ్ చేస్తుంది. 50kW DC ఫాస్ట్ ఛార్జర్‌తో MR,  LR రెండింటికీ ఛార్జింగ్ సమయం 56 నిమిషాలకు తగ్గుతుంది. మరోవైపు, LR ట్రిమ్, 7.2kW AC ఛార్జర్‌తో  6 గంటలలో 15A ప్లగ్ పాయింట్ తో 15 గంటల్లో 10 – 100 శాతం ఛార్జ్ చేస్తుంది.

reen Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

6 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..