Budget 2025 : గ్రీన్ ఎనర్జీకి కేంద్రం భారీగా కేటాయింపులు

Budget 2025 : గ్రీన్ ఎనర్జీకి కేంద్రం భారీగా కేటాయింపులు
New Solar power Plants
Spread the love

Budget 2025 : పునరుత్పాదక ఇంధన పరివర్తనపై కేంద్రం తన నిబద్ధతను చాటుకుంది. కేంద్ర బడ్జెట్ 2025-26 ఫిబ్రవరి 1న పునరుత్పాదన ఇంధన మంత్రిత్వ శాఖ (renewable energy) కు రూ. 26,549.38 కోట్లు కేటాయించింది. ఇది ఏడాది క్రితం రూ. 17,298.44 కోట్ల సవరించిన అంచనాలతో పోలిస్తే 53.48% పెరిగింది. FY21 నుండి కేటాయింపులు 904% పెరిగాయి.

ఈ మొత్తంలో రూ.24,224.36 కోట్లను సౌరశక్తి (Solar Energy)కి ప్రభుత్వం కేటాయించింది. ఇందులో సోలార్ పవర్ (Grid) కోసం రూ. 1,500 కోట్లు, కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ (Kusum) కోసం రూ. 2,600 కోట్లు, ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ( PM Surya Ghar Muft Bijli Yojana) కోసం రూ. 20,000 కోట్లు ఉన్నాయి.

ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించడం ద్వారా కోటి గృహాలకు సౌరశక్తిని అందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, నీటిపారుదల, డీ-డీసీలైజేషన్ వ్యవసాయ రంగానికి మూలాలను అందించడానికి ప్రభుత్వం PM-KUSUM యోజన ను ప్రారంభించిన విషయం తెలిసిందే.. ఈ పథకం కింద, సోలార్ పంపుల ఏర్పాటు కోసం ఇప్పటికే ఉన్న గ్రిడ్-కనెక్ట్ చేయబడిన వ్యవసాయ పంపుల సోలారైజేషన్ కోసం సబ్సిడీ ఇవ్వబడుతుంది.


హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Kiran Podishetty

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు