Harithamithra Telugu News

Home EV Updates బడ్జెట్ 2026: ఎలక్ట్రిక్ కార్ల ధరలు తగ్గుతాయా? ఆటో రంగం ఆశిస్తున్న భారీ మార్పులు ఇవే!

బడ్జెట్ 2026: ఎలక్ట్రిక్ కార్ల ధరలు తగ్గుతాయా? ఆటో రంగం ఆశిస్తున్న భారీ మార్పులు ఇవే!

0
Budget 2026 Auto Sector Expectations

Budget 2026 Auto Sector Expectations : దేశవ్యాప్తంగా మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల నుంచి పారిశ్రామిక వేత్తల వరకు అందరి దృష్టి నేడు (ఫిబ్రవరి 1) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2026-27పైనే ఉన్నాయి. ముఖ్యంగా గత ఏడాదిలో ఆటో రంగం స్థిరమైన వృద్ధిని కనబరిచిన నేప‌థ్యంలో ఈసారి బడ్జెట్ ‘క్లీన్ మొబిలిటీ’ (Clean Mobility) వైపు పెద్దపీట వేస్తుందని పరిశ్రమ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి.

ఈ బడ్జెట్‌లో ఆటోమొబైల్ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు, నిపుణులు ఆశిస్తున్న 5 కీలక మార్పులు ఇవే:

EV విడిభాగాలపై పన్నుల హేతుబద్ధీకరణ

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో వాడే కీలక విడిభాగాలపై అధిక సుంకాలు ఉన్నాయి. దీనివల్ల దేశీయంగా తయారీ ఖర్చు పెరుగుతోంది.ఈ క్రమంలో EV భాగాలపై సుంకాలను హేతుబద్ధీకరిస్తే తయారీ స్థానికీకరణ (Localization) పెరుగుతుందని ప్ర‌ధాన కంపెనీలు చెబుతున్నాయి. దీనివల్ల భారత్ ఇతర దేశాలకు ఈవీ భాగాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతుంది.

GST తగ్గింపు: సర్వీసింగ్, స్పేర్ పార్ట్స్

ప్రస్తుతం కొత్త ఎలక్ట్రిక్ కారు కొంటే 5% GST ఉంటుంది, కానీ అదే కారు రిపేర్ చేయిస్తే లేదా స్పేర్ పార్ట్స్ కొంటే మాత్రం 18% GST పడుతోంది.
నిపుణుల అభిప్రాయం: EY నివేదిక ప్రకారం, ఈ 18% GSTని తగ్గించడం వల్ల ఈవీ మెయింటెనెన్స్ ఖర్చు తగ్గుతుంది. ఇది పెట్రోల్ కార్ల నుండి ఈవీల వైపు ప్రజలు మళ్లడానికి పెద్ద ప్రోత్సాహకం అవుతుంది.

హై-స్పీడ్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు

ఈవీ వాడకంలో అతిపెద్ద సవాలు ‘ఛార్జింగ్’. ఈ బడ్జెట్‌లో మౌలిక సదుపాయాలకు (Infrastructure) భారీ కేటాయింపులు ఉండవచ్చని ఆశిస్తున్నారు. హై-స్పీడ్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇది లగ్జరీ కార్ల మార్కెట్‌తో పాటు సాధారణ వాహన రంగానికి కూడా ఊతమిస్తుందని భావిస్తున్నారు.
రోడ్డు మరియు రవాణా మౌలిక సదుపాయాలకు నిరంతర మద్దతు దేశ ఆర్థిక సామర్థ్యాన్ని పెంచుతుందని
స్కోడా ఆటో వోక్స్‌వ్యాగన్ MD పీయూష్ అరోరా అభిప్రాయపడ్డారు.

‘PM E-DRIVE, సూపర్ యాప్ రాక
ప్రభుత్వం ఈవీ వినియోగదారుల కోసం ఒక సరికొత్త టెక్నాలజీని తీసుకురాబోతున్నట్లు సమాచారం.
సూపర్ యాప్: ఛార్జింగ్ స్టేషన్ల లభ్యత, పేమెంట్ ఇంటిగ్రేషన్ మరియు రియల్ టైమ్ డేటాను అందించే ఒకే ఒక్క యాప్‌ను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది.

PLI పథకం విస్తరణ: బ్యాటరీ రీసైక్లింగ్ మరియు ఛార్జింగ్ పరికరాలను కూడా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (PLI) పథకం కిందకు తీసుకువస్తే పెట్టుబడులు వెల్లువెత్తుతాయి.

లగ్జరీ కార్లు, విదేశీ తయారీదారులు
వోల్వో కార్ ఇండియా MD జ్యోతి మల్హోత్రా ప్రకారం స్థిరమైన, స్పష్టమైన విధానాలు ఉంటే ప్రపంచ స్థాయి తయారీదారులు భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం చూపిస్తారని, దీనికి ఈ బడ్జెట్ ఒక ఉత్ప్రేరకంగా నిలవాలని కోరారు.

సామాన్య వాహనదారుడికి ఏం లాభం?
ఒకవేళ ఈ ప్రతిపాదనలన్నీ బడ్జెట్‌లో అమలైతే..
ధరల తగ్గుదల: విడి భాగాలపై సుంకాలు తగ్గితే ఈవీల ధరలు 5-10% తగ్గే అవకాశం ఉంది.
సులువైన ప్రయాణం: సూపర్ యాప్ ద్వారా ఛార్జింగ్ టెన్షన్ తప్పుతుంది.
మైలేజీ కింగ్స్: హైబ్రిడ్ కార్లపై కూడా పన్ను రాయితీలు లభిస్తే తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు.

ముగింపు

గత బడ్జెట్లలో ప్రభుత్వం ఈవీల కొనుగోలుపై సబ్సిడీలను పెంచింది. కానీ ఇప్పుడు ‘తయారీ , ‘మౌలిక సదుపాయాల’పై దృష్టి పెట్టడం వల్ల దీర్ఘకాలంలో భారత ఆటో రంగం ప్రపంచ స్థాయికి చేరుకుంటుంది. మీ దగ్గర పాత పెట్రోల్ కారు ఉంటే, దాన్ని ఈవీగా మార్చుకోవడానికి లేదా కొత్త ఈవీ కొనడానికి ఈ 2026 బడ్జెట్ ఒక సరైన సమయం కావచ్చు.

Previous articleCocopeat : ఇంట్లోనే కోకోపీట్ తయారు చేయడం ఎలా? – గార్డెనింగ్ చేసేవారికి పూర్తి గైడ్
Next articleహైదరాబాద్‌లో గ్లోబల్ సోలార్ ఎక్స్‌పో 2026: ఫిబ్రవరి 6 నుండి హైటెక్స్‌లో మెగా ఈవెంట్.. పూర్తి వివరాలు!
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here