
మట్టి గణపతి – భక్తులకు, భూమికి రక్షకుడు | ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలనే పూజిద్దాం..
Eco friendly Ganesha | దేశమంతా వినాయక చవిత (Vinayaka Chavithi 2025) ఉత్సవాలకు సన్నద్ధమవుతోంది. నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా వాడవాడలా గణేష్ మండపాలను అందంగా అలంకరిస్తున్నారు. ముఖ్యంగా యూత్ వినియక నవరాత్రి ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అయితే హిందూ పండగలు, సంస్కృతి సంప్రదాయాలను ముందుతరాలకు అందించడంతో పాటు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతీ పండగ వెనక ఎంతో గొప్ప చరిత్ర ఉంటుంది. మన పండుగలు ప్రకృతిలో మమేకమవుతూ నేలా-నీరు, చెట్టూ చేమ సమస్త జీవరాశులను ఆరాధించడం గుర్తించవచ్చు. ఇది మన సంస్కృతిలో భాగంగా అనాదిగా కొనసాగుతూ వస్తోంది. అయతే ఇప్పుడు వినాయక చవితి ఉత్సవాలు వచ్చాయి. కాలుష్యానికి కారణమయ్యే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రసాయన రంగులతో ఆకర్షనీయంగా కనిపించేలా తయారు చేసే విగ్రహాలను పూజించడం ఇకనైనా మానేద్దాం.. ఇలాంటి విగ్రహాల వల్ల పర...