Drone Based Agriculture | డ్రోన్ ఆధారిత వ్యవసాయంతో ఎన్ని ఉపయోగాలో తెలుసా..?
Drone Based Agriculture : మీ పొలంలో ప్రధానంగా పంటలు పండిస్తే, ఖచ్చితమైన పంటల సాగు కోసం డ్రోన్‌ల ప్రయోజనాల గురించి మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే డ్రోన్‌ల వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. డ్రోన్ ఆధారిత వ్యవసాయంలో ఖర్చులు గణనీయంగా తగ్గించుకోవడమే కాకుండా సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలను పొందవచ్చు. వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి పంటల పరిశీలించడంతోపాటు నీటి పారుదల, ఫెర్టిలైజేషన్, పంటల ఆరోగ్యాన్ని విశ్లేషించడం వంటి కార్యక్రమాలను అత్యంత సులభంగా నిర్వహించుకోవచ్చు. ఇది రైతులకు పంటల స్థితిని వేగంగా ఖచ్చితంగా అంచనా వేయడంలో సాయపడుతుంది.డ్రోన్ వల్ల ఉపయోగాలు ఇవీ..మ్యాపింగ్, సర్వేయింగ్ : GPSని ఉపయోగించి, డ్రోన్‌లు 3D మ్యాప్‌లను సృష్టించగలవు. భూమిని, పంటలను కూడా సర్వే చేయగలవు కాబట్టి మీరు మీ పొలాన్ని ఖచ్చితంగా పర్యవేక్షించే సామర్థ్యం కలిగి ఉంటాయి.పశువుల నిర్వహణ -...