Thursday, August 21Lend a hand to save the Planet
Shadow

Organic Farming

PM-ASHA |  రైతులకు కేంద్రం గుడ్ న్యూస్..  పీఎం ఆశా పథకం కొనసాగింపు

PM-ASHA | రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. పీఎం ఆశా పథకం కొనసాగింపు

Organic Farming
PM-ASHA | రైతులకు లాభదాయకమైన ధరలను అందించడానికి, వినియోగదారులకు అవసరమైన వస్తువుల ధరల హెచ్చుతగ్గులను నియంత్రించడానికి ప్రధాన మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ (PM-ASHA) పథకాలను కొనసాగించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 15వ ఆర్థిక సంఘం సమయంలో 2025-26 వరకు దీనిపై మొత్తం ఆర్థిక వ్యయం రూ.35,000 కోట్లు వెచ్చించింది.రైతులు, వినియోగదారులకు మరింత సమర్ధవంతంగా సేవలందించేందుకు ప్రభుత్వం ధరల మద్దతు పథకం (PSS),  ధరల స్థిరీకరణ నిధి (PSF) పథకాలను PM Asha లో విలీనం చేసింది. PM-ASHA సమీకృత పథకం అమలుతో మరింత మేలు చేకూరనుంది. రైతులకు వారి ఉత్పత్తులకు మద్దతు ధరలను అందించడంతోపాటు వినియోగదారులకు సరసమైన ధరలకు వస్తువుల అందించేందుకు ఉపయోగపడుతుంది. PM-ASHA ఇప్పుడు ప్రైస్ సపోర్టు స్కీమ్ (PSS), ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ (PSF), ప్రైస్ లాస్ పేమెంట్ స్కీమ్ (POPS)...
Kharif Season | దెబ్బ‌తీసిన వ‌ర్షాలు.. తెలంగాణలో గత ఐదేళ్లలో ఈసారి అత్యల్ప సాగు

Kharif Season | దెబ్బ‌తీసిన వ‌ర్షాలు.. తెలంగాణలో గత ఐదేళ్లలో ఈసారి అత్యల్ప సాగు

Organic Farming
Kharif Season | హైదరాబాద్ : ఈ వనకాలం (ఖరీఫ్) సీజన్‌లో తెలంగాణలో పంటల సాగు తీవ్రంగా ప‌డిపోయింది.మొత్తం పంట విస్తీర్ణం దాదాపు 1.23 కోట్ల ఎకరాలకే పరిమితమైంది. గత ఏడాది ఇదే కాలంలో 1.29 కోట్ల ఎకరాల సాధారణ విస్తీర్ణంలో 1.28 కోట్ల ఎకరాల్లో సాగు చేశారు. సీజన్ ముగియడానికి ఇంకా రెండు వారాల కంటే తక్కువ సమయం ఉంది. మొత్తం పంట విస్తీర్ణం ఇప్ప‌టికిప్పుడు మెరుగుపడే అవకాశం లేదు.గ‌తేడాది స‌మ‌యానికి పంట‌ల‌కు స‌రిప‌డా సాగునీరు, రైతుబంధు వ్యవసాయ పెట్టుబడి అందడంతో. వ్యవసాయ సాగు వృద్ధికి ఊతమిచ్చింది. గత సంవత్సరాలతో పోల్చినప్పుడు, కోవిడ్ అనంతర కాలంలో వనకాలం సీజన్‌లో ఈసారి అత్యల్పంగా విస్తీర్ణం న‌మోదైంది. సెప్టెంబరు 12 నాటికి 1.23 కోట్ల ఎకరాల్లో మాత్రమే నాట్లు పూర్తయ్యాయి. వనాకాలం సీజన్‌లో సాధారణ సాగు విస్తీర్ణం సుమారు 1.29 కోట్ల ఎకరాల్లో 95 శాతం ఉండేది. గతేడాది 1.28 కోట్ల ఎకరాల్లో నాట్లు పూర్తికాగా, ఈసారి ప‌ర...
Palm Oil | పామాయిల్‌ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

Palm Oil | పామాయిల్‌ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

Organic Farming
Palm Oil | హైదరాబాద్‌ : పామాయిల్‌ రైతులకు కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌ చెప్పింది. ఈ పామ్ ఆయిల్‌ రైతులకు ఊరటనిచ్చేలా ముడి పామాయిల్‌ దిగుమతి సుంకాన్ని పెంచింది. దిగుమతి సుంకాన్ని 5.5శాతం నుంచి ఏకంగా 27.5 శాతానికి పెంచుతూ కేంద్ర ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌కు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ‌న్య‌వాదాలు తెలిపారు. దిగుమతి సుంకం పెంపుతో పామాయిల్‌ రైతుల ( Palm Oil Farmers )కు ఎంతో ప్ర‌యోజ‌నం చేకూరుతుంది. ప్రస్తుతం టన్ను ఆయిల్‌ పామ్‌ గెలల ధర రూ.14,392గా ఉంది. కేంద్రం తాజా నిర్ణ‌యంతో ఇది టన్నుకు రూ.1,500 నుంచి రూ.1,700 వరకు పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా ఒక్కో ఆయిల్‌ పామ్‌ గెల ధర రూ.16,500గా పెరగ‌నుంద‌ని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.తెలంగాణ‌ రాష్ట్రంలో ప్రస్తుతం 44,400 ఎకరాల పామ్‌ ఆయిల్‌ తోటలు ఉన్నాయి. ఇం...
PM Modi | వాతావరణాన్ని తట్టుకోగల 109 విత్తన రకాల విడుదల

PM Modi | వాతావరణాన్ని తట్టుకోగల 109 విత్తన రకాల విడుదల

Organic Farming
Climate Resilient Seed Varieties | వ్యవసాయ ఉత్ప‌త్తులను మెరుగుప‌రిచేందుకు, రైతుల ఆదాయాన్ని పెంపొందించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం అధిక దిగుబడినిచ్చే, వాతావరణాన్ని తట్టుకోగల జీవసంబంధమైన 109 రకాల‌ వ్యవసాయ, ఉద్యానవన పంటల విత్త‌నాల‌ను విడుదల చేశారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR)అభివృద్ధి చేసిన ఈ రకాల్లో 34 క్షేత్ర పంటలు, 27 ఉద్యాన పంటలతో సహా 61 పంటలు ఉన్నాయి.ఢిల్లీలోని పూసా క్యాంపస్‌లోని మూడు ప్రయోగాత్మక వ్యవసాయ క్షేత్రాల‌లో జ‌రిగిన‌ ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ విత్తనాలను ఆవిష్కరించారు, అక్కడ రైతులు, శాస్త్రవేత్తలతో ఆయ‌న చ‌ర్చించారు. క్షేత్ర పంట రకాలలో తృణధాన్యాలు, మినుములు, మేత పంటలు, నూనెగింజలు, పప్పుధాన్యాలు, చెరకు, పత్తి పంటలు ఉన్నాయి. హార్టికల్చర్ కోసం, ప్రధాని కొత్త రకాల పండ్లు, కూరగాయలు, తోటల పంటలు, దుంపలు, సుగంధ ద్రవ్యాలు, పువ్వులు, ఔషధ మొక్కలను వి...
Compost | కిచెన్ గార్డెన్ కోసం మీరే సొంతంగా కంపోస్ట్ ఎరువును ఇలా తయారు చేసుకోండి..

Compost | కిచెన్ గార్డెన్ కోసం మీరే సొంతంగా కంపోస్ట్ ఎరువును ఇలా తయారు చేసుకోండి..

Organic Farming
Compost Making At Home :  మనం ఒక రోజులో ఎంత గృహ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నామో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చింతన్ ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్ అండ్ యాక్షన్ గ్రూప్ నివేదిక ప్రకారం..  పెద్ద నగరాల్లోని మధ్యతరగతి కుటుంబాలు రోజుకు దాదాపు 0.8 కిలోల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నారు. గృహాలలో నుంచి వచ్చే వ్యర్థాల్లో దాదాపు 60% లేదా అంతకంటే ఎక్కువ భాగం సేంద్రీయ పదార్థమే ఉంటుంది. మీ వంటగది వ్యర్థాలను అనవసరమని చెత్తకుప్పలో పడేయకుండా దానిని కంపోస్ట్ ఎరువుగా మార్చుకోవడం అత్యుత్తమమైన మార్గం.అపార్ట్‌మెంట్లలో ఉన్నవారుకూడా ఈజీగా కంపోస్ట్ ను తయారు చేసుకొని టెర్రస్ గార్డెన్ కోసం చక్కగా వినియగించుకోవచ్చు. మీరు మీ రోజువారీ డస్ట్‌బిన్ కంటెంట్‌లను గొప్ప సేంద్రీయ ఎరువుగా మార్చవచ్చు. దానితో పూలమొక్కలు, కూరగాయల మొక్కలను పెంచుకోవచ్చు.సేంద్రీయ వ్యవసాయంలో కంపోస్ట్ చాలా ముఖ్యమైనది.  కంపోస్ట్ ఎరువు మొక్కలకు అనేక రక...
Irrigation | వ్యవసాయంలో నీటిపారుదల ఖర్చులను ఇలా తగ్గించుకోండి..

Irrigation | వ్యవసాయంలో నీటిపారుదల ఖర్చులను ఇలా తగ్గించుకోండి..

Organic Farming
Irrigation | దేశంలోని చాలా రాష్ట్రాల్లో అన్నదాతలను నీటికొరత వేధిస్తోంది. బోర్లు ఎండిపోయి, జలాశయాలు ఇంకిపోయి పంటలన్నీ ఎండిపోతున్నాయి. దీంతో రైతులు అప్పులపాలై కూనారిల్లిపోతున్నారు. అయితే వ్యవసాయంలో నీటిపారుదల చాలా కీలకం.. సాగు పెట్టుడిలో అతిపెద్ద ఖర్చులలో ఇది కూడా ఒకటి. నీటిపారుదల,  నీటి నిర్వహణకు సంబంధించి ఖర్చులు చాలా ఉంటాయి.  బావులు, కాలువలు, ట్యాంకులు లేదా చెరువుల నుండి నీటిని సేకరించడం,  నీటిని పంపింగ్ చేయడానికి విద్యుత్ లేదా డీజిల్‌పై రైతులు ఖర్చు చేస్తుంటారు.ఎకరానికి నీటిపారుదల,  నీటి నిర్వహణ ఖర్చులు ప్రతి పంటకు నీటి డిమాండ్,  దాని కరెంటు యూనిట్ ధరపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు గోధుమలకు, భౌగోళిక స్థితిని బట్టి హెక్టారుకు 13,000 క్యూబిక్ మీటర్ల నుండి 20,000 క్యూబిక్ మీటర్ల  నీటి అవసరం ఉంటుంది. కాబట్టి రైతులు నీటిపారుదల ఖర్చులను తగ్గించుకోగలిగితే, అది మరింత పొదుపు మరియు లాభం పెరుగుతుం...
Saffron Cultivation : ఇంట్లోనే కుంకుమ పువ్వు సాగు.. కిలోకు రూ.3 నుంచి 6 లక్షల్లో సంపాదన..

Saffron Cultivation : ఇంట్లోనే కుంకుమ పువ్వు సాగు.. కిలోకు రూ.3 నుంచి 6 లక్షల్లో సంపాదన..

Organic Farming
Saffron Cultivation | భారతదేశంలో కుంకుమపువ్వును ఉత్పత్తి చేసే ఏకైక రాష్ట్రం జమ్మూ కశ్మీర్.  బంగారు-రంగు పుప్పొడిని కలిగి ఉంటుంది. జమ్మూ కశ్మీర్‌లో సంవత్సరానికి ఒకసారి కుంకుమపువ్వు పండిస్తారు. ఎంతో విలువైన ఈ కుంకుమ పువ్వు (Saffron)  ను "ఎర్ర బంగారం" అని పిలుస్తారు.భారతదేశంలో కుంకుమపువ్వు ఉత్పత్తికి కేంద్రంగా కశ్మీర్ నిలుస్తోంది.  ప్రపంచంలోనే కుంకుమపువ్వు  ఉత్పత్తిలో కశ్మీర్ రెండో స్థానంలో నిలిచింది.కానీ కాశ్మీర్ లోయకు దూరంగా మీ ఇంట్లో కూడా పుట్టగొడుగులను పెంచినట్లుగా కుంకుమ పువ్వును పెంచవచ్చని మీకు తెలుసా.. అవును కాస్త కష్టపడితే ఇది సాధ్యమే.. ఓ రిటైర్డ్ ఇంజినీర్ స్వయంగా ఇంట్లోనే కుంకుమ పువ్వును సాగుచేస్తూ రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు.  నోయిడాకు చెందిన రమేష్ గేరా తన ఇంట్లోని ఒక చిన్న గదిలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కుంకుమ పువ్వు మొక్కలను చుస్తే మీరు ఆశ్చర్యపోతారు.1980లో NIT కురుక్షేత...
Millets Farming | అందరూ ఈమెను ‘క్వీన్ ఆఫ్ మిల్లెట్స్’ పిలుస్తారు.. గిరిజన మహిళా రైతు ఘనత చూస్తే

Millets Farming | అందరూ ఈమెను ‘క్వీన్ ఆఫ్ మిల్లెట్స్’ పిలుస్తారు.. గిరిజన మహిళా రైతు ఘనత చూస్తే

Organic Farming
queen of millets | ఒడిశాలోని గిరిజన భూమియా కమ్యూనిటీకి చెందిన 36 ఏళ్ల రైమతి ఘియురియా ఒక సాధార‌ణ గిరిజన మ‌హిళా రైతులా క‌నిపిస్తుంది. కానీ గతేడాది సెప్టెంబరు 9న న్యూఢిల్లీలో జరిగిన G20 సమ్మిట్‌లో ఒడిశా త‌ర‌పున ఆమె ప్రాతినిధ్యం వహించింది. కోరాపుట్ జిల్లాలో సంప్ర‌దాయ వ‌రి, చిరుధాన్యాల (millets) వంగ‌డాల‌ను సంరక్షించడంలో ఆమె అద్భుత‌మైన జీవ‌న ప్ర‌యాణాన్ని వివ‌రించినప్పుడు అంద‌రూ ఆశ్చ‌ర్యపోయారు. సేంద్రియ రైతుగా, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్‌గా, అనుభవజ్ఞుడైన శిక్షకురాలిగా ఆమె సాధించిన అద్భుతమైన విజయాలు వెలుగులోకి వచ్చాయి.. అయితే ఈ ఆద‌ర్శ మ‌హిళా రైతు గురించి మ‌న‌మూ తెలుసుకుందాం..కుంద్రా బ్లాక్‌లోని నౌగూడ గ్రామానికి చెందిన రైమతి (Raimati Ghiuria )  తన భర్త గోబింద ఘియురియా, వారి ముగ్గురు పిల్లలతో కలిసి నివాసముంటున్నారు.  సేంద్రియ వ్యవసాయానికి కట్టుబడి , ఆమె 2500 మంది సహచర రైతులకు శిక్షణ ఇచ్చింది. సేం...
Organic agriculture | సేంద్రియ వ్యవసాయానికి మారడానికి ఏడు చిట్కాలు

Organic agriculture | సేంద్రియ వ్యవసాయానికి మారడానికి ఏడు చిట్కాలు

Organic Farming
Organic agriculture| వ్యవసాయం (రసాయనాల వినియోగంతో సాగు) నుండి సేంద్రియ వ్యవసాయానికి వెళ్లడం వల్ల ఖర్చులు తగ్గుతాయి, భూసారాన్ని మెరుగుపడుతుంది. అలాగే ఆరోగ్యకరమైన పంటలను ఉత్పత్తి చేయవచ్చు. సేంద్రీయ వ్యవసాయానికి మారడానికి రైతులు కొన్ని మార్గాలను అనుసరించాల్సి ఉంటుంది.మానవ ఆరోగ్యం, పర్యావరణంపై రసాయన ఎరువులు, పురుగుమందుల హానికరమైన ప్రభావాల గురించి అవగాహన పెరగడంతో, చాలా మంది రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లుతున్నారు. ఈ ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది.  భారతదేశం దీనికి మినహాయింపు కాదు.సేంద్రియ వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం. ఇది నేల సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది. నీటి వినియోగాన్ని తగ్గిస్తుంది, జీవవైవిధ్య పరిరక్షణను ప్రోత్సహిస్తుంది, కాలుష్యాన్ని నివారిస్తుంది, వ్యవసాయ ఖర్చులను తగ్గిస్తుంది, ఆరోగ్యకరమైన పంటలను ఉత్పత్తి చేస్తుంది.What are the methods of natural farming?...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు