Tuesday, December 3Lend a hand to save the Planet
Shadow

Electric Metro Express : హైదరాబాద్ రోడ్లపై కొత్తగా ఎలక్ట్రిక్ బస్సుల పరుగులు..

Spread the love

New Electric Metro Express Buses Launching : హైదరాబాద్ వాసులుకు శుభవార్త. రణగొన ధ్వనులు, ఊపిరి సలపని పొగకు కారణమయ్యే డీజిల్ బస్సుల స్థానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పర్యావరణ హితమైన  ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. TSRTC కొత్తగా 25 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టింది.  హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్డులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka), రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్ (Ponnam Prabhakar), రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ( komatireddy Venkatreddy), ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తదితరులు మంగళవారం జెండా ఊపి ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. పాత మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల స్థానంలో కొత్తగా 500 బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని వారు చెప్పారు.

అద్దె ప్రతిపాదికన 500 ఏసీ బస్సులు

అద్దె ప్రతిపాదికన  500 ఎయిర్ కండిషన్డ్ బస్సులను  ఆగస్టు వరకు  అందుబాటులోకి రానున్నాయి.  కాగా ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జింగ్‌ కోసం బీహెచ్‌ఈఎల్‌, మియాపూర్‌, కంటోన్మెంట్‌, హెచ్‌సీయూ, రాణిగంజ్‌ డిపోల్లో 33 కేవీ పవర్‌ చార్జింగ్ స్టేషన్లను ఆర్టీసీ ఏర్పాటు చేసింది.  రాబోయే రోజుల్లో నగరంలోని అన్ని రూట్లలోనూ ఏసీ బస్సులు  పరుగులు పెట్టనున్నాయి.  రోవైపు ఆర్టీసీ సొంతంగా…565 డీజిల్‌ బస్సులు  తీసుకోవాలని నిర్ణయించింది. అందులో 300 మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులు, 140 ఆర్డినరీ, 125 మెట్రో డీలక్స్‌లు ఉంటాయి.  ఈ బస్సుల్లో  మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.

గత ఫిబ్రవరిలో 100 కొత్త బస్సులను కొనుగోలు చేసినట్లు  ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇందులో మహాలక్ష్మి పథకం కోసం 90 ఎక్స్​ప్రెస్​ బస్సులను కేటాయించామని చెప్పారు హైదరాబాద్​-శ్రీశైలం (Srishailam) రూట్ లో  10 ఏసీ రాజధాని సర్వీసులను నడుపుతున్నామని చెప్పారు.  ఆర్టీసీ  ఆదాయం చాలా ఆరోగ్యంగా ఉందని, ఇందుకు ప్రభుత్వమే కారణమని  కొనయాడారు. ఆర్టీసీ ఉద్యోగులు ఏడేళ్లుగా ఎదురు చూస్తున్న 21 శాతం ఫిట్ మెంట్ ప్రకటించడం సంతోషకరమని అన్నారు.    ఇప్పుడు మరో 25 కాలుష్యరహిత బస్సులు ప్రవేశపెట్టడం ఆనందంగా ఉందన్నారు. ఈ కొత్త ఎలక్ట్రికల్ నాన్ ఏసీ బస్సులు (Electric Metro Express Buses) మహలక్ష్మి పథకానికి అనుసందానం చేస్తున్నట్లు సజ్జనార్ ప్రకటించారు.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.  అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *