Flipkart Black Friday Sale | బజాజ్ చేతక్ పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. కొనుగోలుకు ఇదే సమయం.. ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో బజాజ్ ఆటో దూసుకుపోతోంది. ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్‌లో సరికొత్త ఆఫర్లతో వినియోగదారులకు చేరువవుతోంది. ఇప్పుడు, ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ లో బజాజ్ చేతక్ ఈవీ(Bajaj Chetak EV) పై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఇప్పుడు మీరు బజాజ్ చేతక్ 3202 ను భారీ డిస్కౌంట్ తో సొంతం చేసుకోవచ్చు.
కాగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్, రెండు రంగులలో లభిస్తుంది. Brooklyn Black, Matter Coarse Grey రంగుల్లో అందుబాటులో ఉంది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 1,15,018. అయితే సేల్ సమయంలో అందుబాటులో ఉన్న డీల్‌ల బండిల్‌తో, మీరు ధర రూ. 7,000 కంటే ఎక్కువ డిస్కౌంట్ పొందవచ్చు. చేతక్ 3202లో మీరు అన్ని డిస్కౌంట్‌లను ఎలా పొందవచ్చో ఇప్పుడు తెలుసుకోండి..
ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్: బజాజ్ చేతక్ 3202 తగ్గింపులు
Flipkart Black Friday Sale: ఎలక్ట్రిక్ వాహనాలను మరింత తక్కువ ధరలకు అందుబాటులో తెచ్చేందుకు ఫ్లిప్‌కార్ట్ సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. మీరు బజాజ్ చేతక్ 3202ని కొనుగోలు చేయాలనుకుంటే మీకు పలు రకాల డిస్కౌంట్లను ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది.
Bajaj Chetak 3202 discounts : ఫ్లిప్ కార్ట్‌లో క్రెడిట్ కార్డ్ చెల్లింపులతో (మీ బ్యాంక్‌ని బట్టి) రూ. 6,000 వరకు తగ్గింపును పొందండి లేదా డెబిట్ కార్డ్ చెల్లింపులతో గరిష్టంగా రూ. 2,000 తగ్గింపును పొందవచ్చు. అదనంగా, ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఫ్లాట్ రూ. 3,000 డిస్కౌంట్ ఉంది. అంతేకాకుండా మీరు మీ చెల్లింపులను విస్తరించాలని చూస్తున్నట్లయితే, Flipkart గరిష్టంగా 3 సంవత్సరాల కాలవ్యవధితో సౌకర్యవంతమైన EMI స్కీమ్ లను కూడా అందిస్తోంది.ఈ డీల్‌లన్నింటినీ పరిగణలోకి తీసుకంటే బజాజ్ చేతక్ 3202 కేవలం రూ. 1,06,417 ఎక్స్-షోరూమ్ ధరకే మీ సొంతం కావచ్చు.
ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్: బజాజ్ చేతక్ 3202 స్పెక్స్
బజాజ్ చేతక్ 3202 ఈవీ 3.2 kWh బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది 5.6 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. బజాజ్ ప్రకారం, ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ చార్జిపై 137 కి.మీ రేంజ్ అందిస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 73 కి.మీ వేగంతో వెళ్తుంది. బ్యాటరీని 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి, ఇది 3 గంటల 35 నిమిషాలు పడుతుంది. ఈ మోడల్ ఒక ఎకో రైడ్ మోడ్‌తో మాత్రమే వస్తుంది.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..