Home » Ather Rizta Best Deal | ఏథర్ రిజ్టా ఫ్యామిలీ స్కూటర్ పై ఆకర్షణీయమైన డీల్స్..
Ather Rizta Best Deal

Ather Rizta Best Deal | ఏథర్ రిజ్టా ఫ్యామిలీ స్కూటర్ పై ఆకర్షణీయమైన డీల్స్..

Spread the love

Ather Rizta Best Deal | న్యూ ఇయర్ లో ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల ధ‌ర‌లు పెంచ‌డానికి ముందుగానే ఫ్లిప్‌కార్ట్ (Flipkart) లో ఏథర్ రిజ్టా పై గొప్ప డీల్‌లను అందిస్తోంది. ఏథర్ ఎనర్జీ పోర్ట్‌పోలియోలో ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ గా పాపులర్ అయిన రిజ్టా వేరియంట్ తో కంపెనీ విక్రయాలు గ‌ణ‌నీయంగా పెరిగాయి. రిజ్టా ప్రారంభ ధర రూ. 1.10 లక్షల నుంచి రూ. 1.47 లక్షల (ఎక్స్-షోరూమ్ ) ఉన్నాయి. అయితే మీరు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఆక‌ర్ష‌ణీయ‌మైన డీల్స్ ఎక్క‌డ, ఎలా పొందాలో తెలుసుకోండి..

READ MORE  Hero Vida V2 Lite | హీరో విడా లైట్, టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్లలో ఏది బెస్ట్..

అథర్ రిజ్టా: బెస్ట్‌ డీల్

Ather Rizta Best Deal ఎంట్రీ-లెవల్ రిజ్టా ఎస్‌ను రూ. 1.04 లక్షల కంటే తక్కువ ధరకే ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌ కార్ట్ (Flipkart) అందిస్తోంది. రూ. 5,000 కంటే ఎక్కువ కొనుగోలు చేస్తే ఫ్లాట్ రూ. 2,500 డిస్కౌంట్ ను అందిస్తుంది. సౌకర్యవంతమైన EMI ఎంపికలతో, క్రెడిట్ కార్డ్‌లు రూ. 8,500 వరకు ఆఫర్ చేస్తాయి.

అథర్ రిజ్టా: స్పెసిఫికేషన్‌లు

ఏథ‌ర్‌ రిజ్టా S మోడల్ 2.9 kWh బ్యాటరీతో శ‌క్తిని పొందుతుంది. 5.7 bhp, 22 Nm టార్క్‌ని జ‌న‌రేట్ చేస్తుంది. గంట‌కు 80 kmph గరిష్ట వేగంతో దూసుకుపోతుంది. ఇది కేవలం 4.7 సెకన్లలో 0-40 kmph వేగాన్ని అందుకుంటుంద‌ని కంపెనీ పేర్కొంది. ఇక దీని రేంజ్‌ 123 కిమీ( IDC). ఇది 8 గంటల 30 నిమిషాలలో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. 6 గంటల 30 నిమిషాలలో 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.

READ MORE  Hero Vida V2 Lite | హీరో విడా లైట్, టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్లలో ఏది బెస్ట్..

రిజ్టా S 34-లీటర్ విశాలమైన అండర్-సీట్ బూట్‌తో పాటు 22-లీటర్ ఫ్రంక్ స్పేస్‌తో అందిస్తుంది. ఇది టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో 7-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఇ-స్కూటర్ 12-అంగుళాల అల్లాయ్ వీల్స్, 130 మిమీ డ్రమ్ బ్రేక్‌లతో కూడిన 200 మిమీ ఫ్రంట్ డిస్క్, ఇండికేటర్‌లతో సహా అన్ని ఎల్‌ఇడి లైట్లు ఉంటాయి. రిజ్టా గ్రౌండ్ క్లియరెన్స్ 165 మిమీ, సీట్ ఎత్తు 780 మిమీ, పిలియన్ సీట్ ఎత్తు 840 మిమీ.

Flipkart Year-end sale Ather Rizta Best Deal
Ather Energy,
Electric scooters,
,

READ MORE  Hero Vida V2 Lite | హీరో విడా లైట్, టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్లలో ఏది బెస్ట్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top