Harithamithra Telugu News

Home EV Updates Flipkart : కేవలం రూ. 88,000కే TVS iQubeని తీసుకెళ్లండి..

Flipkart : కేవలం రూ. 88,000కే TVS iQubeని తీసుకెళ్లండి..

0
TVS iQube టీవీఎస్ మోటార్ ఫిబ్రవరి 2026లో 31,600 ఈ-స్కూటర్లను విక్రయించి మార్కెట్ లీడర్‌గా నిలిచింది.
TVS iQube

Flipkart Year End Sale : ఫ్లిప్‌కార్ట్ ఇయర్-ఎండ్ సేల్‌లో భాగంగా టీవీఎస్ ఐక్యూబ్‌పై ఆఫర్ల‌మీద ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో ఒకటిగా iQube నిలిచింది. TVS మోటార్‌కి EV విభాగంలో టీవీఎస్ ఐక్యూబ్ అమ్మ‌కాల్లో రెండవ స్థానాన్ని ఆక్ర‌మించింది. అయితే ఫ్లిప్ కార్ట్‌లో భారీ డిస్కౌంట్ల‌ను ఎలా పొందాలో ఇక్క‌డ తెలుసుకోండి..

TVS iQube: ఫ్లిప్‌కార్ట్ ఆఫ‌ర్స్‌

ఫ్లిప్‌కార్ట్‌లోని రిటైల్ ధర ఆధారంగా , iQube 2.2 kWh మోడల్ ధర రూ. 1,07,299, అయితే ఇ-కామర్స్ దిగ్గజం రూ. 20,000 వరకు తగ్గింపు ధ‌ర‌కు అందిస్తోంది. 2024 సంవత్సరం 2025కి మారకముందే iQubeని పొందేందుకు ఇదే స‌రైన సమయం కావొచ్చు. Flipkart రూ. 20,000 కంటే ఎక్కువ ధర ఉన్న ఉత్పత్తులపై నేరుగా రూ. 12,300 డిస్కౌంట్ ఇస్తోంది. మరో రూ. 2,500, క్రెడిట్ కార్డ్‌లపై డీల్‌లు రూ. 8,950 వరకు అదనపు డిస్కౌంట్లు అందిస్తోంది.ఇ-కామర్స్ వెబ్‌సైట్ రూ. 6,000 వరకు తగ్గింపును అందించే సౌకర్యవంతమైన EMI పథకాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.

TVS iQube ప్రత్యేకతలు

TVS iQube 2.2 kWh వెర్షన్ 4 bhp, 33 Nm టార్క్‌ను అందిస్తుంది. గరిష్టంగా 75 kmph వేగంతో ప్ర‌యాణిస్తుంది .ఇది పూర్తి ఛార్జింగ్ పై 75 kmph వరకు రైడింగ్ రేంజ్‌ను అందిస్తుంది. బ్యాటరీ 0-80 శాతం నుండి ఛార్జ్ చేయడానికి సుమారు 2 గంటల 45 నిమిషాలు పడుతుంది. స్కూటర్ 5-అంగుళాల TFT డిజిటల్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇక దీని బ్రేకింగ్ సిస్టమ్‌లో 220mm ఫ్రంట్ డిస్క్, 130mm వెనుక డ్రమ్ ఉన్నాయి, గ్రౌండ్ క్లియరెన్స్157mm, సీటు ఎత్తు 770mm ఉంటుంది.


హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Previous articleChetak vs Rizta | కొత్త బజాజ్ చేతక్, ఏథర్ రిజ్టాలో ఏది బెస్ట్?
Next articlePM Kisan Yojana : రైతులకు కొత్త సంవత్సర కానుక.. త్వరలో బ్యాంకు ఖాతాల్లోకి రూ.10వేలు జమ?
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here