Warivo CRX Electric Scooter | వారివో మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, తన మొట్టమొదటి హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్, CRXని విడుదల చేసింది. రోజువారీ ప్రయాణ అవసరాల కోసం రూపొందించబడిన ఈ CRX ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం రూ. 79,999/- ప్రారంభ ధరతో లంచ్ అయ్యింది.. ఇది ఐదు రంగుల ఎంపికలలో అందుబాటులో ఉంది.
CRX ఎలక్ట్రిక్ స్కూటర్ విద్యార్థుల నుండి వృద్ధుల వరకు విస్తృత శ్రేణి వినియోగదారులకు అనుకూలంగా రూపొందించారు. ఇందులో ఏకంగా 42-లీటర్ స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. మొబైల్ ఛార్జింగ్ పోర్ట్‌లు (టైప్-సి యుఎస్‌బి) ను కూడా చూడవచ్చు. 150 కిలోల అధిక లోడింగ్ కెపాసిటీతో వస్తుంది, ఇది రోజువారీ వినియోగానికి చక్కని ఎంపికగా నిలుస్తుంది.
గంటకు 55కి.మీ వేగం..
55 km/h గరిష్ట వేగంతో, స్కూటర్ రెండు రైడింగ్ మోడ్‌లు ఎకో మరియు పవర్ మోడ్ లు ఉంటాయి. ఇది పనితీరును పర్యవేక్షించడానికి డేటా లాగింగ్ సామర్థ్యాలతో సహా బ్యాటరీ లలైఫ్ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో కూడిన ఫీచర్‌లను కలిగి ఉంది. CRX స్కూటర్ భద్రతను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఇందులో వాటర్‌ప్రూఫ్, ఫైర్‌ప్రూఫ్, బ్లాస్ట్ ప్రూఫ్ బ్యాటరీ ఉంటుంది. ఇది వేడెక్కడం ఇతర సమస్యలను నివారించడంలో సహాయపడటానికి నాలుగు ఉష్ణోగ్రత సెన్సార్లు, బ్యాటరీ నిర్వహణ వ్యవస్థ (BMS)ని కలిగి ఉంటుంది. అదనంగా, లాంగ్ రైడ్‌ల సమయంలో బ్యాటరీ పనితీరును నిర్వహించడానికి ఇది ClimaCool సాంకేతికతను కలిగి ఉంటుంది. స్కూటర్ UL 2271 భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.
లో స్పీడ్ స్కూటర్లు కూడా..
Warivo Motors భారతదేశంలో విభిన్నమైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల శ్రేణిని అందిస్తోంది. పట్టణ, సెమీ-అర్బన్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుంది. వారివో నుంచి వచ్చిన వివిధ మోడల్‌లలో స్మార్టీ ఈవీ స్కూటర్ 25 కిమీ/గం గరిష్ట వేగంతో వెళ్తుంది. దీని ధర సుమారు రూ.74,300 గా ఉంది.
ఇది కాంపాక్ట్ బిల్డ్, పరిమిత వేగంతో తక్కువ ప్రయాణాలు చేసేవారి కోసం కంపెనీ అందిస్తోంది. Warivo క్వీన్ SX, మరొక Low Speed Scooter ను కూడా అందిస్తుంది, దీని ధర సుమారు కేవలం రూ. 46,800. తక్కువ బడ్జెట్ లో ఈవీ కావాలనుకునేవారి కోసం ఇది చక్కని ఎంపిక అన్ని మోడళ్లలో, Warivo ఫైర్ ప్రూఫ్ బ్యాటరీలు, బలమైన బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ (BMS) వంటి భద్రతా లక్షణాలను కలిగి ఉన్నాయని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..