GT Texa electric bike | జిటి ఫోర్స్ (GT Force) తాజాగా భారత్ లో కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. GT Texa అని పిలిచే ఈ బ్యాటరీతో నడిచే ఈ బైక్ ధర రూ. 1,19,555 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. గుర్గావ్ ఆధారిత EV తయారీ స్టార్టప్ ప్రారంభించిన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఇదే కావడం విశేషం.
TEXA Electric Bike స్పెక్స్ & ఫీచర్లు
GT టెక్సా ఎలక్ట్రిక్ బైక్ లో ఇన్సులేట్ చేయబడిన BLDC మోటార్ ను వినియోగించారు. ఇది గంటకు 80 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ఇందులో 3.5 kWh లిథియం-అయాన్ బ్యాటరీ నుంచి శక్తి పొందుతుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120-130 కిమీల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది 4-5 గంటల్లో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఆటో -కట్‌తో ఆన్‌బోర్డ్ మైక్రో ఛార్జర్‌తో వస్తుంది. GT టెక్సా 180 కిలోల లోడ్ సామర్థ్యం, 18 డిగ్రీల గ్రేడబిలిటీని కలిగి ఉంది.
TEXA Electric Bike హార్డ్‌వేర్ విషయానికొస్తే, GT టెక్సా 80-100/18 ఫ్రంట్, 120-80/17 వెనుక ట్యూబ్‌లెస్ టైర్లతో అల్లాయ్ వీల్స్ ఉంటాయి. బ్రేకింగ్ విషయానికొస్తే.. రెండు వైపులా డిస్క్ బ్రేక్‌ల ద్వారా నియంత్రించవచ్చు. E-ABS ఉంటుంది. సస్పెన్షన్ డ్యూటీలను ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుకవైపు డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ చూసుకుంటాయి. సీటు ఎత్తు 770mm మరియు గ్రౌండ్ క్లియరెన్స్ 180mm ఉంటుంది. ఇది 120 కిలోల (కెర్బ్) బరువు కలిగి ఉంటుంది.
ఫీచర్ల విషయానికొస్తే, GT టెక్సాలో 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రిమోట్ స్టార్ట్/స్టాప్, సెంట్రల్ లాకింగ్, LED హెడ్‌లైట్, టైల్‌లైట్ మరియు టర్న్ సిగ్నల్స్ ఉన్నాయి. ఈ ఆఫర్‌లో మూడు రైడ్ మోడల్స్ ఉన్నాయి.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..