Home » క్రూయిజ్ కంట్రోల్‌తో కొత్త Hero Electric Optima HX

క్రూయిజ్ కంట్రోల్‌తో కొత్త Hero Electric Optima HX

Hero Electric sales 2023
Spread the love

భారతదేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిత‌న హీరో ఎలక్ట్రిక్ తన Optima HX సిటీ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అప్‌డేటెడ్ వ‌ర్ష‌న్ ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇందులో చెప్పుకోద‌గిన విశేష‌మేంమంటే ఈ కొత్త వ‌ర్ష‌న్‌లో క్రూయిజ్ కంట్రోల్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. కొత్త Hero Electric Optima HX (క్రూయిజ్ కంట్రోల్‌) స్కూటర్ భారతదేశంలో ప్రారంభ (ఎక్స్‌షోరూం) ధ‌ర రూ. 55,580.( పోస్ట్ రివైజ్డ్ FAME II సబ్సిడీతో) ప్రారంభించారు.

hero-electric-optima

ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అప్‌డేట్

కొత్త Hero Electric Optima HX ఎల‌క్ట్రిక్ స్కూటర్ క్రూయిజ్ కంట్రోల్‌తో పాటు అప్‌డేట్ చేయబడిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను చూడ‌వ‌చ్చు. ఈ ఇన్‌స్ట్రుమెంట్ క్ల‌స్ట‌ర్‌లో క్ర‌యిజ్ కంట్రోల్ ఆన్‌లో ఉందా లేదా అనేది ప్రదర్శిస్తుంది. ఇప్పుడు, మీరు క్రూయిజ్ కంట్రోల్‌ను ఎంగేజ్ చేయాలనుకుంటే, మీరు చేయాల్సిందల్లా బటన్‌ను నొక్క‌డ‌మే.. క్ర‌యిజ్ కంట్రోల్ యాక్టివేట్ అయిన తర్వాత, అది ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో చూపిస‌తుంది. క్రూయిజ్ కంట్రోల్‌ను నిలిపివేయడానికి, రైడర్ థొరెటల్‌ను ట్విస్ట్ చేయాలి లేదా బ్రేక్‌లను వేయాల్సి ఉంటుంది. ఈ ఫీచ‌ర్ సుదూర ప్ర‌యాణాలు చేసే రైడర్ల‌కు ఎంతో సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది.

READ MORE  Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

హీరో ఎల‌క్ట్రిక్ ఆప్టిమా హెచ్ఎక్స్ న్యూ వేరియంట్ లాంచ్‌పై హీరో ఎలక్ట్రిక్ సీఈవొ సోహిందర్ గిల్ మాట్లాడుతూ.. హీరో బైక్‌లపై వాల్యూ యాడెడ్ ఫీచర్లను అందించడంతోపాటు రైడ్‌ను సులభంగా ఆహ్లాదకరంగా మార్చేందుకు త‌మ R&D విభాగం క్లిష్టతరమైన ఆవిష్కరణలపై నిరంతరం కృషి చేస్తోంద‌ని తెలిపారు. క్రూయిజ్ కంట్రోల్ వంటి ఈ ఫీచర్లలో కొన్ని బైక్‌లో మాత్ర‌మే ఉన్నాయ‌ని తెలిపారు. “సురక్షితమైన, అనుకూలమైన బైక్‌లను రూపొందించడానికి చేస్తున్న మా ప్రయాణంలో ఇవి చిన్న దశలు” అని ఆయన తెలిపారు.
అయితే Hero Electric Optima HX 1.2 kW ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంది, గరిష్ట వేగం 42 kmph. సింగిల్ చార్జిపై 82 km వ‌ర‌కు ప్ర‌యాణించ‌వ‌చ్చు. ఇది రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. అందులో ఒక‌టి సింగిల్-బ్యాటరీ వెర్షన్
ఎక్స్ షోరూం ధ‌ర 55,580. రెండోది డ్యూయ‌ల్ బ్యాట‌రీ వెర్ష‌న్ ధ‌ర రూ. 65,640.

READ MORE  Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

మరిన్ని అప్‌డేట్‌ల కోసం హ‌రిత‌మిత్ర వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.. ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు సంబంధించిన వీడియోల కోసం మా Haritha mithra YouTubeHaritha mithra YouTube ఛానెల్‌ను స‌బ్‌స్క్రైబ్ చేసుకోండి..!

Hero Electric Optima hx Specifications

  • Range 120 km Speed 45 kmph
  • Motor 550 Watt
  • Battery 2 Lithium ion battary 51.2v 30ah
  • Brakes Front- drum, Rear- drum
  • Tyres Tubeless 12 inch
  • Head light Led Single
  • Battery warranty 3 years
  • Motor warranty 3 years
  • Charging time 4 to 5 hours
  • License and Registration required
READ MORE  Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

2 thoughts on “క్రూయిజ్ కంట్రోల్‌తో కొత్త Hero Electric Optima HX

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *