వాణిజ్య నగరంలో 500 battery swapping solution centres
Hero Electric Partnership : దేశీయ అతిపెద్ద ఈవీ తయారీ సంస్థ Hero Electric (హీరో ఎలక్ట్రిక్ ) తాజాగా VoltUp & Adani Electricity సంస్థలతో జట్టు కట్టింది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో EV ఛార్జింగ్ ఇన్‌ఫ్రా ఏర్పాటు కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ భాగస్వామ్యం కింద 2024 నాటికి ముంబై అంతటా దాదాపు 500 బ్యాటరీ ఎక్స్‌చేంజ్ సొల్యూషన్ సెంటర్‌లను ఏర్పాటు చేస్తుంది. ఇది ప్రతిరోజూ 30,000 మంది వినియోగదారులను సేవలు అందిస్తుంది.
ముంబైలో బ్యాటరీ స్వాపింగ్ విప్లవాత్మకంగా మార్చేందుకు హీరో ఎలక్ట్రిక్.. వన్-స్టాప్ బ్యాటరీ మార్పిడి స్టార్ట్-అప్ VoltUp అలాగే Adani Electricity (అదానీ ఎలక్ట్రిసిటీ ) తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.
EV రంగాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో స్మార్ట్ మొబిలిటీని పెంచడానికి OEM, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, లాస్ట్-మైల్ పార్టనర్‌లు, బ్యాటరీ స్వాపింగ్ స్టార్ట్-అప్ కలివచ్చాయని భాగస్వాములు చెబుతున్నారు. EV ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను సెట్ చేయడానికి స్కేల్ అప్ చేయడానికి కంపెనీలు కలిసి పని చేయనున్నాయి.
ఈ భాగస్వామ్యంపై హీరో ఎలక్ట్రిక్ సీఈఓ సోహిందర్ గిల్ మాట్లాడుతూ.. “, EV వ్యాప్తిని మరింతగా పెంచడానికి, జీరో-ఎమిషన్ స్థితిని పొందేందుకు భారతదేశంలో EV పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి తాము ఎల్లప్పుడూ కృషి చేస్తున్నామని తెలిపారు. VoltUp, Adani Electricity, Zomatoతో ఈ అనుబంధం మంది రైడర్‌లు EVలకు మారడానికి దోహదపడుతుందని తెలిపారు.
Hero Electric Partnership లో భాగంగా ముంబై చర్చ్‌గేట్ నుండి మీరా-భయందర్ వరకు కవర్ చేయడానికి ఈ కంపెనీలు సంవత్సరాంతానికి 50 బ్యాటరీ స్వాపింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. వారి ప్రయత్నంలో VoltUp బ్యాటరీ మార్పిడిని సులభంగా యాక్సెస్ చేయడానికి నగరం అంతటా స్మార్ట్ ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టేషన్‌లను ఏర్పాటు చేస్తుంది. ఈ భాగస్వామ్యం 2024 నాటికి ముంబై అంతటా 500 బ్యాటరీ మార్పిడి సొల్యూషన్స్ సెంటర్‌లను ప్రారంభించాలని చూస్తోంది. ఇది ప్రతిరోజూ 30,000 మంది రైడర్‌లకు సేవలందిస్తుంది.
VoltUp సహ-వ్యవస్థాపకుడు & CEO సిద్ధార్థ్ కబ్రా మాట్లాడుతూ “ముంబై వంటి వేగవంతమైన నగరంలో సమయం ఎల్లప్పుడూ ముఖ్యమైనది. ఈవీ వాహనదారులు ఫాస్ట్‌గా బ్యాటరీ మార్పిడికి వీలు కల్పించడం వల్ల రేంజ్ విషయంలో వారు ఆందోళన దూరమై ఆర్థికంగా ఎదగగలుగుతారు. అదానీ ఎలక్ట్రిసిటీ యొక్క విస్తృతమైన నెట్‌వర్క్, అలాగే హీరో ఎలక్ట్రిక్ యొక్క అధునాతన, సరసమైన ఉత్పత్తుల తయారీ, EV పరిశ్రమతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని తెలిపారు.