Kia | కియా ఇండియా ఎలక్ట్రిక్ కార్ల వినియోగదారులకు శుభవార్త చెప్పింది. వాహనదారులు దేశవ్యాప్తంగా 1000 పైగా EV ఛార్జింగ్ స్టేషన్‌లను గుర్తించేందుకు కియ ‘MyKia’ యాప్‌లో “K-Charge” అనే వినూత్న ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. ఇది Kia కస్టమర్‌లకు మాత్రమే కాదు.. EV యజమానులందరూ వినియోగించుకోవచ్చు. రేంజ్ ఆందోళనను తగ్గించే లక్ష్యంతో Kia-యేతర వినియోగదారులకు కూడా దాని ప్రయోజనాలను విస్తరిస్తుంది.
ఐదు చార్జింట్ పాయింట్ ఆపరేటర్లతో ఒప్పందం
ఐదు ఛార్జింగ్ పాయింట్ ఆపరేటర్ల (CPOలు) స్టాటిక్, ఛార్జ్‌జోన్, రిలక్స్ ఎలక్ట్రిక్, లయన్ ఛార్జ్ మరియు ఇ-ఫిల్ సాయంతో కియా ఇండియా ఈ చొరవను ప్రారంభించింది. అదనంగా, కియా తన వినియోగదారులకు వారి ఛార్జింగ్ స్టేషన్ల ద్వారా మూడు నెలల ఉచిత ఛార్జింగ్‌ను అందించడానికి రిలక్స్ ఎలక్ట్రిక్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. ఈ CPOలు EV ఛార్జింగ్ పరిశ్రమలో గుర్తింపు పొందిన నాయకులు, విస్తృతమైన నెట్‌వర్క్‌లు, గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ మరియు సేఫ్టీ ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఉంటాయి.
K-Charge ఎన్నో సౌకర్యాలు
K-Charge లో ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్లు EV వినియోగదారులకు అదనపు సౌకర్యాన్ని అందిస్తాయి. ‘MyKia’ యాప్ ద్వారా విస్తృత శ్రేణి EV సేవలను సజావుగా యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది.
- ఇండియా మ్యాప్ సర్వీస్ ప్రొవైడర్, మ్యాప్ మై ఇండియా నుంచి ఇంటరాక్టివ్ మ్యాప్‌ని ఉపయోగించి వినియోగదారులు ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్‌లను వీక్షించడంతోపాటు గుర్తించవచ్చు.
- K-Charge ద్వారా కస్టమర్‌లు ఛార్జింగ్ స్లాట్‌ల లభ్యతను చెక్ చేసుకోవచ్చు.
- వారి ప్రాధాన్యతల ఆధారంగా స్టేషన్‌ను కనుగొనవచ్చు
- యాప్‌లోని వాలెట్ సేవను ఉపయోగించి చెల్లింపులు చేయవచ్చు.
- ఈ వినియోగదారు- EV ఛార్జింగ్ ప్రక్రియను సులభతరం చేయడం ద్వారా ఇతర అప్లికేషన్లను ఆశ్రయించాల్సిన అవసరం ఉండదు.
Kia ప్రకటన
Kia ఇండియా నేషనల్ హెడ్ ఆఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ హర్దీప్ సింగ్ బ్రార్ మాట్లాడుతూ.. “K-ఛార్జ్ అనేది మా కస్టమర్‌ల కోసం ఒక అనుకూలమైన చొరవ మాత్రమే కాదు.. గ్రీన్ మొబిలిటీని సౌకర్యవంతంగా.. అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ఒక అడుగు. సాంకేతిక పరివర్తన వైపుగా మారుతుందని మేము గట్టిగా నమ్ముతున్నాము. electric vehicles భవిష్యత్తు సాఫీగా ఉండాలి. K-ఛార్జ్, ‘MyKia’ యాప్‌తో వినియోగదారులకు కావలసిన అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను విస్తరించే దిశగా మేము మా ప్రయత్నాలను కొనసాగిస్తాము.
K-Charge ఫీచర్ తో కూడిన ‘EV For All’ అనే కొత్తగా ప్రవేశపెట్టిన విజన్ ద్వారా.. Kia Motors 2026 నాటికి ఒక మిలియన్ EVల వార్షిక విక్రయాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇంకా కంపెనీ ఈ సంఖ్యను ఏటా 1.6 మిలియన్ యూనిట్లకు విస్తరించాలని యోచిస్తోంది. 2030, వివిధ లాంగ్ రేంజ్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల (BEVలు) ప్రారంభించాలని సన్నాహాలు చేస్తోంది.
Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి ట్విట్టర్, ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.