Home » Komaki Ranger electric cruiser వ‌చ్చేసింది..

Komaki Ranger electric cruiser వ‌చ్చేసింది..

Komaki-Ranger
Spread the love
  • సింగిల్ చార్జిపై 180కి.మి రేంజ్‌
  • ధ‌ర రూ. 1.68 లక్షలు ( ఎక్స్ షోరూం )
  • మ‌రో స్కూట‌ర్ కొమాకి వెనిస్ ధర రూ. 1.15 లక్షలు
Komaki Ranger electric cruiser
Komaki Ranger electric cruiser

kima

ఢిల్లీ-NCR-ఆధారిత కంపెనీ అయిన‌ Komaki Electric Vehicles సంస్థ‌ 2016లో ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలోకి ప్రవేశించింది. ఇప్పుడు ఈ కంపెనీ దేశంలో రెండు కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విడుదల చేసింది. వాటిలో ఒకటి మొదటి-రకం ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ అయితే రెండోది వెస్పా మాదిరి ఎలక్ట్రిక్ స్కూటర్ కొమాకి వెనిస్. కోమాకి రేంజర్ ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ ధ‌ర రూ. 1.68 లక్షలు. కాగా కొమాకి వెనిస్ ఇ-స్కూటర్ ధర రూ. 1.15 లక్షలు.

Komaki Ranger electric cruiser  స్పెసిఫికేష‌న్లు..

కోమాకి రేంజర్ భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్‌సైకిల్. ఇది డీప్ బ్లూ, గార్నెట్ రెడ్, జెట్ బ్లాక్ అనే మూడు రంగులలో అందుబాటులో ఉంటుంది. రేంజర్ లో 4kW (5.36 hp) ఎలక్ట్రిక్ మోటార్‌ను పొందుప‌రిచారు. 4kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 180-200 కిమీల క్లెయిమ్ రైడింగ్ రేంజ్‌ను అందిస్తుంది. స్మార్ట్ ఫీచర్ల పరంగా ఇది బ్లూటూత్ సౌండ్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, యాంటీ-థెఫ్ట్ లాక్ సిస్టమ్, సైడ్-స్టాండ్ సెన్సార్ మొదలైనవి ఉంటాయి. అంతేకాకుండా, ఈ ఎలక్ట్రిక్ క్రూయిజర్ పెద్ద అల్లాయ్ వీల్స్, రెండు స్టోరేజ్ బాక్స్‌లు, ఫాక్స్ ఎగ్జాస్ట్‌ను కలిగి ఉంది.

Komaki Venice Features, స్పెసిఫికేష‌న్స్‌

Komaki Ranger electric cruiser

కోమాకి వెనిస్ రెట్రో స్టైలింగ్‌తో కూడిన ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది మొత్తం 10 కలర్ షేడ్స్‌లో అందుబాటులో ఉంటుంది. వెనిస్ 2.9kWh బ్యాటరీ ప్యాక్‌తో జతచేయబడిన 3kW (4 hp) ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంది. అయితే, కంపెనీ దీని రేంజ్‌ను ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. ఫీచ‌ర్ల విష‌యానికొస్తే Komaki వెనిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ self-diagnosis system, మొబైల్ ఛార్జింగ్ పాయింట్, యాంటీ-థెఫ్ట్ లాక్ సిస్టమ్, రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్, రివర్స్ అసిస్ట్, పగటిపూట రన్నింగ్ LED తో LED హెడ్‌ల్యాంప్ వంటివి ఉంటాయి.

ధ‌ర‌ల వివ‌రాలు

కొత్త కొమాకి రేంజర్ ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ భారతదేశంలో రూ. 1.68 లక్షలకు(ఎక్స్‌షోరూం) విడుదల చేయబడింది. కొమాకి వెనిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.15 లక్షలుగా ఉంది. అయితే ఇవి రాష్ట్ర రాయితీలను బ‌ట్టి ధ‌ర‌ల్లో మార్పులు ఉండ‌వ‌చ్చు. ఈ కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు జనవరి 26, 2022 నుండి దేశవ్యాప్తంగా అన్ని కోమాకి షోరూంల‌లో అందుబాటులో ఉంటాయి.

Model Price (ex-showroom)
Komaki Ranger Rs 1.68 lakh
Komaki Venice Rs 1.15 lakh

2 thoughts on “Komaki Ranger electric cruiser వ‌చ్చేసింది..

  1. Needed to draft you a little word to be able to say thank you once again about the beautiful strategies you have documented on this website. It’s quite seriously open-handed with people like you to make freely just what a lot of folks could have advertised for an electronic book to make some money on their own, certainly since you might have done it in the event you wanted. Those secrets in addition served like the great way to comprehend someone else have a similar zeal similar to my very own to know way more pertaining to this issue. I am certain there are thousands of more enjoyable moments ahead for those who see your site.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *