పూణేకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన స్టార్టప్.. టోర్క్ మోటార్స్ (Tork Motors) , ఈ ఏడాది జనవరిలో కొత్త క్రాటోస్, క్రాటోస్ ఆర్ (Kratos and Kratos R) అనే ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది. వాటి ధరలు (ఎక్స్-షోరూమ్ పూణే. ) వరుసగా రూ. 1.08 లక్షలు, రూ. 1.23 లక్షలుగా నిర్ణయించారు. ఈ బైక్‌ల డెలివరీలు మొదట ఏప్రిల్‌లో ప్రారంభం కావాల్సి ఉండగా, కొన్ని సమస్యల కారణంగా అవి ఆలస్యమయ్యాయి. ఎట్టకేలకు ఇప్పుడు కంపెనీ తన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల (electric two-wheeler) డెలివరీలను ప్రారంభించింది.
టోర్క్ మోటార్స్ మొదటి రోజు 20 యూనిట్ల క్రాటోస్, క్రాటోస్ ఆర్ డెలివరీ చేసింది. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను మహారాష్ట్రలోని పూణెలోని కంపెనీ ప్రధాన కార్యాలయం నుంచి వినియోగదారులకు అందజేయడం జరిగింది. టోర్క్ మోటార్స్ ప్రస్తుతం పూణె, హైదరాబాద్ (Hyderabad), బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్ మరియు ఢిల్లీలో మాత్రమే తమ ఉత్పత్తులను అందిస్తోంది. దశలవారీగా ఇతర నగరాలకు విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది.
Kratos స్పెసిఫికేషన్లు
స్పెసిఫికేషన్ల గురించి మాట్లాడితే.. టోర్క్ క్రాటోస్ ఎలక్ట్రిక్ బైక్ 5.36 బిహెచ్‌పి, 28 ఎన్ఎమ్‌లకు టార్క్, 7.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది. అయితే క్రాటోస్ ఆర్ మోడల్ మరింత శక్తిమంతమైనది. ఇందులో 6 బిహెచ్‌పి, 38 ఎన్ఎమ్‌లను టార్క్ ఉత్పత్తి చేసే 9 కిలోవాట్ మోటార్‌ను అమర్చారు. ఈ రెండు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌లు 4kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటాయి. అవి అనువైన పరిస్థితుల్లో ఒకే ఛార్జ్‌పై 180 కిమీల పరిధిని అందించగలవని కంపెనీ పేర్కొంది. Kratos – Kratos R
TechteluguTechtelugu