
low Cost EV Scooter | BattRE ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ LOEV+ పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తాజాగా విడుదల చేసింది. ఇందులో మూడు సంవత్సరాల వారంటీతో అమరాన్ 2kWh బ్యాటరీని వినియోగించారు. ఇది గంటకు 60 km/h వేగంతో ప్రయాణిస్తుంది. ₹69,999 (ఎక్స్-షోరూమ్) ధర కలిగిన ఈ వాహనం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది.
BattRE స్కూటర్ లో IP67-రేటెడ్ బ్యాటరీని ఉపయోగించారు. ఫుల్ ఛార్జింగ్ కావడానికి 2 .50 గంటల సమయం పడుతుంది. ఇది వివిధ మూడు రైడింగ్ మోడ్‌లను అందిస్తుంది:
- ఎకో మోడ్‌లో 90 కిమీ (35 కిమీ/గం),
- కంఫర్ట్ మోడ్‌లో 75 కిమీ (48 కిమీ/గం),
- స్పోర్ట్స్ మోడ్‌లో 60 కిమీ (60 కిమీ/గం).
low Cost EV : సేఫ్టీ, స్మార్ట్ ఫీచర్స్..
ఇక సేఫ్టీ ఫీచర్ల విషయానికొస్తే.. కంబైన్డ్ డిస్క్-బ్రేక్ సిస్టమ్, 180mm గ్రౌండ్ క్లియరెన్స్, పార్కింగ్ స్విచ్, సారీ గార్డ్ ఉన్నాయి. ఈ వాహనంలో క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, CAN-ఎనేబుల్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా ఉన్నాయి.
కొత్త స్కూటర్ లాంచ్ గురించి BattRE ఎలక్ట్రిక్ మొబిలిటీ CEO నిశ్చల్ చౌదరి మాట్లాడుతూ.. అధునాతన బ్యాటరీ సాంకేతికత, ఫీచర్-రిచ్ స్పెసిఫికేషన్లతో LOEV+ ను “దేశంలో అత్యంత సరసమైన హై-స్పీడ్ స్కూటర్” గా అభివర్ణించారు. ఈ స్కూటర్‌లో 12-అంగుళాల అల్లాయ్ వీల్స్, LED లైటింగ్ ఉన్నాయి. స్టార్‌లైట్ బ్లూ, స్టార్మీ గ్రే, ఐస్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్, పెర్ల్ వైట్ అనే ఐదు రంగు ఎంపికలలో వస్తుంది. దీని స్పీడోమీటర్ లో బ్యాటరీ స్థితి, స్పీడ్ తదితర పూర్తి సమాచారాన్ని ప్రదర్శిస్తుంది.
భారతదేశ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో పెరుగుతున్న పోటీ మధ్య ఈ కొత్త స్కూటర్ ఆవిష్కరణ జరిగింది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పర్యావరణ ఆందోళనల నేపథ్యంలో వినియోగదారులు కూడా ఈవీలపై ఆసక్తి చూపుతున్నారు. ఈవీ మార్కెట్ వాటాను స్వాధీనం చేసుకోవడానికి ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలు కూడా మెరుగైన శ్రేణి, అత్యాధునిక ఫీచర్లతో కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..