ఒక్కరోజే 400 వాహనాల సేల్
మహీంద్రా ఇటీవలే తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV భారత మార్కెట్లో ప్రవేశపెట్టగా వాహనా డెలివరీలు ప్రారంభమయ్యాయి. Mahindra XUV400 ధరలు (ఎక్స్-షోరూమ్) రూ. 15.99 లక్షలతో ప్రారంభమవుతాయి. ఇవి ఒక్కో ఛార్జీకి 456 కిమీల డ్రైవింగ్ రేంజ్‌ను అందజేస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే మహీంద్రా XUV400 EV కస్టమర్ డెలివరీలు ఇప్పుడు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. గుడి పడ్వా సందర్భంగా కంపెనీ మొదటి రోజునే XUV400 400 యూనిట్లను డెలివరీ చేసింది.
Mahindra XUV400 : డెలివరీ / వెయిటింగ్ పీరియడ్
మహీంద్రా XUV400 టాప్-స్పెక్ EL వేరియంట్ డెలివరీలు భారతదేశంలో ప్రారంభమయ్యాయి. దీని బేస్-స్పెక్ EC వేరియంట్ ఈ సంవత్సరం దీపావళి నాటికి అందుబాటులోకి వస్తుంది. కొత్త XUV400 ఎలక్ట్రిక్ SUV మొదటి దశలో 34 భారతీయ నగరాల్లో అందుబాటులో ఉంది. మహీంద్రా ఇప్పటికే XUV400 కోసం 10,000 కంటే ఎక్కువ బుకింగ్‌లను నమోదుచేసుకుంది. దీని కోసం ఏడు నెలల వరకు వేచి ఉండాల్సిన అవసరం ఉంది.
మహీంద్రా XUV400: బ్యాటరీ, రేంజ్
మహీంద్రా XUV400 EL వేరియంట్ 39.4 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది ఒక్కో ఛార్జ్‌కి 456 కిమీ పరిధిని అందజేస్తుందని కంపెనీ పేర్కొంది. దీని బేస్-స్పెక్ EC వేరియంట్ 34.5 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉండి ఒక్కసారి ఛార్జింగ్‌పై 375 కిమీ పరిధిని అందిస్తుంది. కొత్త మహీంద్రా XUV400 148 bhp, 310 Nm టార్క్‌ను అభివృద్ధి చేసే ఒకే ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంది. దీని గరిష్ట వేగం గంటకు 150 కి.మీ.
మహీంద్రా XUV400: ధరలు (ఎక్స్-షోరూమ్) ఇవీ..
XUV400 EC (బ్యాటరీ 3.3 kW) రూ. 15.99 లక్షలు
XUV400 EC (బ్యాటరీ 7.2 kW ) రూ. 16.49 లక్షలు
XUV400 EL (బ్యాటరీ 7.2 kW ) రూ. 18.99 లక్షలు
మహీంద్రా XUV400ని మూడు వేరియంట్లలో అందిస్తోంది. దీని ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 15.99 లక్షల నుండి రూ. 18.99 లక్షల వరకు ఉన్నాయి. ఇవి ప్రారంభ ధరలు.. మొదటి 5,000 మంది కొనుగోలుదారులకు మాత్రమే చెల్లుబాటు అవుతాయని కంపెనీ పేర్కొంది. కాగా ఈ ఎలక్ట్రిక్ SUV టాటా Nexon EV Prme, Nexon EV మాక్స్, MG ZS EV, హ్యుందాయ్ కోనా వంటి ఎలక్ట్రిక్ వాహనాలతో పోటీ పడుతుంది.