Thursday, November 21Lend a hand to save the Planet
Shadow

Maruti Electric car: మారుతి నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ కారు.. లాంచ్ ఎప్పుడంటే?

Spread the love

Maruti Electric car : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఇటీవల కొత్త స్విఫ్ట్‌ తో సహా అనేక కొత్త మోడళ్లను భారతీయ రోడ్లపై పరీక్షిస్తోంది. ఈ క్రమంలో తొలి సారి మారుతి సుజుకి ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ Maruti Electric Car భారతదేశంలో టెస్టింగ్ సమయంలో కెమెరాకు చిక్కింది. ఇంతకు ముందు ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పోలండ్‌లో కూడా ప్రత్యక్షమైంది. టోక్యోలో జరిగిన 2023 జపాన్ మొబిలిటీ షో లో సుజుకి రెండు మోడళ్లను పరిచయం చేసింది. 2024లో స్విఫ్ట్, 2024 చివరిలో లేదా 2025 ప్రారంభంలో మారుతి ఈవీఎక్స్ ఎస్యూవీ భారతదేశంలో లాంచ్ అవుతాయని ఆటోమొబైల్ వర్గాలు భావిస్తున్నాయి.

కొన్ని నెలల క్రితం Maruti eVX  టెస్ట్ మ్యూల్స్ మొదటిసారిగా కెమెరాల్లో చిక్కుకున్నాయి, విదేశీ గడ్డపై ట్రయల్ రన్ నిర్వహిస్తోంది. ఇప్పుడు, eVX ఎలక్ట్రిక్ SUV టెస్ట్ మ్యూల్ మొదటిసారిగా భారతీయ రోడ్లపై పరీక్షిస్తున్న ఫొటోలు, వీడియోలు  వైరల్ అయ్యాయి. ఈ ఏడాది ప్రారంభంలో పోలాండ్‌లో ఎలక్ట్రిక్ కారును పరీక్షించారు.

Maruti Electric Car ఎలా ఉంది?

కొత్త మారుతి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సిల్వర్ కనెక్ట్ బార్, సి- పిల్లర్ ఇంటిగ్రేటెడ్ రియర్ డోర్ హ్యాండిల్, ఇంటిగ్రేటెడ్ రూఫ్ స్పాయిలర్‌ తో ర్యాప్ అరౌండ్ టెయిల్ ల్యాంప్‌లను కలిగి ఉంది. దీని పైకప్పు ఈ కారుకు కూపే వంటి రూపాన్ని ఇస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ చుట్టూ క్లాడింగ్ ను విస్తృతంగా ఉపయోగించారు.. ఇదే కారుకు ఆకర్షణగా ఉండనుంది. మారుతి సుజుకి ఈవీఎక్స్ క్యాబిన్ అనేక ఫీచర్లతో ఉండనుందని స్పై పిక్స్ ఆధారంగా తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి

Maruti Electric car ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్ఫోటైన్‌మెం ట్ యూనిట్ కోసం 2 స్పోక్ స్టీరింగ్ వీల్ వెనుక బిగ్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇది నిలువుగా పేర్చిన ఎయిర్కాన్ వెంట్‌లతో ఇబ్బంది లేని డాష్‌ బోర్డ్ లేఅవుట్, సెంటర్ కన్సోల్‌లో రోటరీ డయల్‌ను కలిగి ఉంది. ఇది ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు తో వస్తుంది. ఇందులో ఎయిర్‌బ్యాగ్‌లు, ఏడీఏఎస్ కలిగి అవకాశం కూడా ఉంది.

కొత్త స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫారమ్‌…

మారుతి eVX ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ గుర్గావ్‌లోని కంపెనీ ప్రొడక్షన్ ప్లాంట్‌ సమీపంలో టెస్టింగ్ చేస్తుండగా కనిపించింది. ఎంఎస్ఐఎల్ ఇంకా దాని నిర్మాణం గురించి వివరాలను వెల్లడించ లేదు. అయితే దీన్ని కొత్త స్కేట్‌ బోర్డ్ ప్లాట్‌ఫారం పై నిర్మించనున్నారని పలు నివేదికలు సూచిస్తున్నాయి. దీనిని 27 పీఎల్ అనే కోడ్ నేమ్‌తో పిలుస్తారు. ఈ ఆర్కిటెక్చర్‌ను టయోటా 40 పీఎల్ ఎలక్ట్రిక్ స్కేట్‌బోర్డ్ ఆర్కిటెక్చర్ నుంచి తీసుకున్నారు. ఈ సరి కొత్త ఈవీ గుజరాత్‌లోని సుజుకి తయారీ ప్లాంట్‌లో తయారైంది. దీని ధర రూ. 16 లక్షల నుంచి రూ. 20 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా. ఈ మారుతి eVX ఎలక్ట్రిక్ ఎస్ యూవీ ప్రస్తుతం భారతీయ మార్కెట్ లో ఉన్న MG ZS EV, హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్, మహీంద్రా XUV400, టాటా నెక్సాన్ EV మాక్స్‌తో  పోటీ పడనుంది.  మరోవైపు  మారుతీ సుజుకి తర్వాత టయోటా కూడా భారతీయ మార్కెట్ లో కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

Maruti Eactric car డిజైన్, ఇంటీరియర్

మారుతి – 2023 ఆటో ఎక్స్‌పో లో మారుతి eVX  కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. ఈ కాన్సెప్ట్ ఎస్ యూవీ పొడవు 4.3 మీటర్లు, వెడల్పు 1.8 మీటర్లు ఉంది. ఎత్తు 1.6 మీటర్లు ఉంది. దీని వీల్‌ బేస్ 2.7 మీటర్లు ఉండడం విశేషం. డాటెడ్ మోడల్ క్లీన్ ఫ్రంట్ ఫాసియా తో కాన్సెప్ట్ మోడల్‌తో సమానంగా కనిపించింది. ఇది ఖాళీగా ఉన్న గ్రిల్, ఎల్ -ఆకారపు హెడ్‌ ల్యాంప్‌లు, మృదువైన బంపర్‌ను కలిగి ఉంది.

ఇంజిన్ పతీరు ఎలా ఉంది?

మారుతి ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లో ఎల్ఎఫ్‌పీ బ్లేడ్ సెల్‌లతో కూడిన 60 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్‌ చేస్తే 550 కిలోమీటర్ల రేంజ్‌ను ఈ కారు అందించనుంది. అయితే ఇది ప్రొడక్షన్ మోడల్‌లో దాదాపు 400 కిలోమీటర్ల రేంజ్ అందించే చిన్నబ్యాటరీ ప్యాక్ వేరియంట్‌ను కూడా లాంచ్ చేసే చాన్స్ ఉంది.


Green Mobility, Environment న్యూస్ కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *