స్విఫ్ట్ CNG కొత్త Z12E ఇంజన్‌తో కూడిన మొదటి మోడల్ కావచ్చు
32km/kg కంటే ఎక్కువ మైలేజ్ ఇస్తుందని అంచనా
Maruti Swift CNG | అన్ని ఇతర మారుతి సుజుకి కార్ల మాదిరిగానే, స్విఫ్ట్ కూడా త్వరలో CNG వేరియంట్ ను మార్కెట్ లోకి రానుంది. ఇది కొత్త ఇంజిన్‌తో కూడిన మొదటి CNG ఆధారిత కారుగా మారుతుంది. పెట్రోల్-CNG పవర్‌ట్రెయిన్ స్వచ్ఛమైన CNG మోడ్‌లో ఉన్నప్పుడు కొంచెం తక్కువ పవర్, టార్క్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంటుంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
Maruti Swift CNG స్పెసిఫికేషన్స్..
మారుతి స్విఫ్ట్ కొత్త 1.2-లీటర్, మూడు-సిలిండర్ల Z12E సహజంగా ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇది 82hp, 112Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్, ఆప్షనల్ 5-స్పీడ్ AMTతో లభించే ఈ కొత్త ఇంజన్‌తో వచ్చిన భారతదేశంలో మొట్టమొదటి మారుతి సుజుకి కారు స్విఫ్ట్. అయితే స్విఫ్ట్ CNG ధర వేరియంట్.. పెట్రోల్ వేరియంట్‌ల కంటే దాదాపు రూ. 90,000-95,000 ప్రీమియమ్‌గా ఉండవచ్చని తెలుస్తోంది.
Bajaj Bruzer CNG Bike | రోడ్లపై తళుక్కున మెరిసిన కొత్త బజాజ్ CNG బైక్..
కొత్త స్విఫ్ట్ ప్రస్తుతం రూ. 6.49 లక్షల నుండి రూ. 9.64 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది, అయితే సిఎన్‌జి వేరియంట్‌లు సంబంధిత పెట్రోల్ వేరియంట్‌ల కంటే దాదాపు రూ. 90,00-95,000 కంటే ఎక్కువ ధరలను కలిగి ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. CNG పవర్‌ట్రెయిన్‌తో ఏ వేరియంట్‌లు అందించబడతాయో ఇంకా చూడాల్సి ఉంది.
మారుతి స్విఫ్ట్ సీఎన్జీ : మైలేజీ
కొత్త మారుతి స్విఫ్ట్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో 24.80kpl ఇంధన కెపాసిటీ కలిగి ఉంటుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో క్లాస్-లీడింగ్ 25.75kplని మైలేజీ ఇస్తుంది. ఇక స్విఫ్ట్ CNG 32km/kg కంటే ఎక్కువ మైలేజీని అందిస్తుందని అంచనా ఉంది. దీని ప్రత్యర్థులు హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్, టాటా టియాగో రెండూ CNG సీఎన్జీ వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..