Harithamithra Telugu News

Home EV Updates Ampere | గుడ్ న్యూస్.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.10000 తగ్గింపు

Ampere | గుడ్ న్యూస్.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.10000 తగ్గింపు

0
Ampere electric scooters
Ampere Scooters

Ampere : ఇటీవలే ఆంపియర్ కొత్త నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ (Nexus) ను విజయవంతంగా ప్రారంభించిన తర్వాత,ఈ కంపెనీ తన పాత మోడళ్లలో కొన్నింటిని మరింత తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకురావడానికి నిర్ణయించుకుంది. అందులో అంపియర్ రియో లి ప్లస్, మాగ్నస్ ఎల్‌టి, మాగ్నస్ ఇఎక్స్ మోడళ్లపై రూ.10,000 ధర తగ్గించినట్లు ఆంపియర్ ప్రకటించింది.

ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటరల్లో Magnus మోడల్ ఎంతో పాపులర్ అయింది. మాగ్నస్ రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. అవి Magnus LT,  Magnus EX.  తాజాగా ఈ మోడల్ ధరలు తగ్గించిన తరువాత ఈ వేరియంట్ల ధరలు వరుసగా రూ. 84,900. రూ. 94,900 లకు అందుబాటులో ఉంది. ఇందులో 60V/28Ah బ్యాటరీ ప్యాక్‌తో అమర్చబడి ఉంది, ARAI-క్లెయిమ్ చేసిన పరిధి 84km, కంపెనీ క్లెయిమ్ చేయబడిన గరిష్ట వేగం 50kph.

Ampere Nexus : త‌క్కువ ధ‌ర‌లోనే ఆంపియ‌ర్ నెక్స‌స్ స్కూట‌ర్ వచ్చేసింది… ఫీచర్లు, ధరల వివరాలు ఇవే..

ఇక Ampere Rio Li Plus మోడళ్ల ధరలను కూడా తగ్గించింది. రియో లి ప్లస్ ఇప్పుడు రూ. 59,900 (ఎక్స్-షోరూమ్)కి అందుబాటులో ఉంది. రియో లి ప్లస్ ఒక వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది ప్రధానంగా నగరంలో తక్కువ వేగం, తక్కువ దూరాల వరకు ప్రయాణించేవారి కోసం రూపొందించింది. ఇది 1.3kWh లిథియం-అయాన్ బ్యాటరీతో అమర్చబడి ఉంది. ఇది డిటాచబుల్. సింగిల్ చార్జిపై  70km వరకు మైలేజీ ఇస్తుంది.  Rio Li Plus గంటకు 25kph గరిష్ట వేగంతో వెళ్తుంది. తక్కువ-స్పీడ్ ఇ-స్కూటర్  కావడం వల్ల దీనికి ఎలాంటి రిజిస్ట్రేషన్లు, లైసెన్సులు అవసరం లేదు.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Previous articleMaruti Omni electric : మారుతి ఓమ్ని వ్యాన్.. త్వరలో ఎలక్ట్రిక్ రూపంలో వస్తుందా?
Next articleMaruti Swift : త్వ‌ర‌లో మారుతి స్విఫ్ట్ CNG వేరియ‌ట్ లాంచ్! స్విఫ్ట్ CNG లో మై లేజీ ఎంత ఉండొచ్చు?
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here