MG Comet Electric Car: రోజుకు రూ.17 ఖర్చుతో 230 కి.మీ ప్రయాణం

Spread the love

ఆకర్షణీయమైన ఫీచర్లతో ఎంజీ ఎలక్ట్రిక్ కారు

ఎంజీ మోటార్స్ నుంచి తక్కువ ధరలో విడులైన రెండో ఎలక్ట్రిక్ కారు ఈ కామెట్. ఈ చిన్న ఎలక్ట్రిక్ కారుతో అతి తక్కువ ఖర్చుతో ప్రయాణించవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కారును మీరు కేవలం రూ. 7.98 లక్షల ప్రారంభ ధరతోనే సొంతం చేసుకోవచ్చు. దీని రన్నింగ్ కాస్ట్ ఒక నెలకు పిజ్జా ధర కంటే తక్కువగా ఉంటుంది.
ఈ కారులో రెండు, నాలుగు సీట్లు ఉంటాయి. ఈ సంవత్సరమే ఎంజీ కంపెనీ ఈ కారును మార్కెట్ లోకి విడుదల చేసింది. ప్రస్తుతం ఇది పలు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఒక్కో వేరియంట్లో పలు రకమైన ఫీచర్లు ఉన్నాయి. ఎంజీ కామెట్ ఫేస్ ధర రూ.7.98 లక్షలు, ఎంజీ కామెట్ ప్లే ధర రూ.9.28 లక్షలు, ఎంజీ కామెట్ ప్లష్ ధర రూ.9.98 లక్షలుగా ఉంది.

ఈ కామెట్ కారులో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టం ఉంటుంది. వైర్ సెల్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేలను ఇది సపోర్ట్ ఇస్తుంది. స్టీరింగ్ వీల్ పై కంట్రోల్ బటన్లను పొందుపరిచారు. ఇది 17.3KWh బ్యాటరీని కలిగి ఉంటుంది.. ఎలక్ట్రిక్ మోటార్ 41Bhp శక్తిని, 110 ఎంఎన్ టార్క్ ను జనరేట్ చేస్తుంది.

mg comet

సింగిల్ చార్జిపై 230కి.మీ రేంజ్

ఈ బ్యాటరీని ఒక్కసారి చార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. దీంట్లో పోర్టబుల్ చార్జర్ అందుబాటులో ఉంటుంది. 3.3 కేడబ్ల్యూ చార్జర్ సాయంతో 7 గంటల్లోనే పూర్తిగా చార్జ్ అవుతుంది. ఐదు గంటల సమయంలో 0 నుంచి 80శాతం వరకూ చార్జ్ అవుతుంది.

సేఫ్టీ ఫీచర్లు

ఎంజీ కామెట్ ఎలక్ట్రిక్ కారులో సేఫ్టీ విషయానికి వస్తే డ్యూయల్ ఏయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, రియర్ పార్కింగ్ సెన్సార్, సీట్ బెల్ట్ రిమైండర్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ కెమెరా, స్పీడ్ సెన్సింగ్.. డోర్ లాక్ ఫంక్షన్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉంటాయి. ఈ కారులో 55 కంటే ఎక్కువ కార్ ఫీచర్లు, వైర్లెస్ ఆండ్రాయిడ్, యాపిల్ కార్ ప్లే, ఫోటింగ్ ఆపిల్ కార్ ప్లే, ఫ్లోటింగ్ ట్విన్ డిస్ప్లే, 100 కంటే ఎక్కువ వాయిస్ కమాండ్స్ డిజిటల్ కీ వంటి అత్యాధునిక ఫీచర్లు కూడా ఉంటాయి.

mg comet electric car

ఇదిలా ఉంటే నెల మొత్తానికి ఈ కారును చార్జ్ చేయడానికి కేవలం రూ. 519 మాత్రమే ఖర్చు అవుతుందని ఎంజీ పేర్కొంది. నెలకు వెయ్యి కిలోమీటర్ల పరిధిని దృష్టిలో పెట్టుకొని లెక్కించారు. ఈ లెక్క ప్రకారం రోజుకు చార్జింగ్ కోసం అయ్యే ఖర్చు కేవలం రూ.17 మాత్రమే. (ఇది ఢిల్లీలో కరంట్ చార్జీల ఆధారంగా ఇచ్చినది)


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు… కృతజ్ఞతలు..

Green Mobility, Environment అప్ డేట్స్ కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

12 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..