దేశవ్యాప్తంగా MG Comet EV డీలర్‌షిప్‌లు

దేశవ్యాప్తంగా MG Comet EV డీలర్‌షిప్‌లు

టెస్ట్ డ్రైవ్‌లు షురూ..

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Comet EV ని MG మోటార్ ఇండియా ఇటీవల విడుదల చేసింది. సరికొత్త MG Comet EV ఎక్స్-షోరూమ్ ధర రూ.7.98 లక్షలుగా నిర్ణయించారు. ఈ అందమైన చిన్న ఎలక్ట్రిక్ కారు దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌లకు చేరుకోవడం ప్రారంభమైంది. దీని కోసం టెస్ట్ డ్రైవ్‌లు (MG Comet EV Test drives ) కూడా షురూ అయ్యాయి. MG కామెట్ బుకింగ్‌లు ఈ నెల 15న తెరవనున్నారు. ఈ నెలాఖరులో డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది.

MG Comet EV Test drives

MG Motor India.. ఏప్రిల్ 27న కామెట్ టెస్ట్ డ్రైవ్‌లను ప్రారంభించింది. ఈ ఎలక్ట్రిక్ కారును తనిఖీ చేయడానికి, అనధికారికంగా రిజర్వ్ చేయడానికి వారి సమీపంలోని MG డీలర్‌షిప్‌ సెంటర్ ను సందర్శించవచ్చు. అయితే, కామెట్ అధికారిక బుకింగ్‌లు మే 15న ప్రారంభమవుతాయి. డెలివరీలు ఈ నెలాఖరులోగా ప్రారంభం కానున్నాయి. కంపెనీ రాబోయే రోజుల్లో వేరియంట్‌ల వారీగా ధరలను ప్రకటించనుంది.

MG కామెట్ EV: బ్యాటరీ, పరిధి పనితీరు

MG కామెట్ EV వాహనం 17.3 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఒక్కో సింగిల్ ఛార్జీకి 230 కిమీల డ్రైవింగ్ రేంజ్ నను అందజేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది 42 బిహెచ్‌పి, 110 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని విడుదల చేసే ఒకే ఎలక్ట్రిక్ మోటారు ద్వారా నడుస్తుంది. సాధారణ AC ఛార్జర్‌ని ఉపయోగించి ఈ ఎలక్ట్రిక్ కారును 7 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. అయితే ఇది DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇవ్వకపోవడం డ్రా బ్యాక్ గా చెప్పవచ్చు.

MG కామెట్ EV కి పోటీ ఏదీ?

కొత్త MG కామెట్ EV ఎక్స్ షోరూం ధరలు రూ. 7.98 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. MG మోటార్ ఇండియా త్వరలో దాని వేరియంట్ వారీగా ధరలను ప్రకటించనుంది. ఈ వాహనం టాప్-స్పెక్ ట్రిమ్ ధర దాదాపు రూ. 10 లక్షల వరకు ఉంటుంది. ఈ చిన్న ఎలక్ట్రిక్ కారు టాటా టియాగో EV, టిగోర్ EV, సిట్రోయెన్ eC3 వంటి వాహనాలతో పోటీ పడనుంది.

మరిన్ని ఈవీ అప్‌డేట్స్ కోసం హరితమిత్ర ను చూస్తూ ఉండండి.. తాజా టెక్ వార్తల కోసం మా టెక్ ఈనాడు ను సందర్శించండి

Harithamithra

👉 “Eco friendly & environmental news updates for Free”

వ్యవసాయం, సోలార్​​ ఎనర్జీ, గ్రీన్​ మొబలిటికి సంబంధించిన అప్‌డేట్స్​ను ఉచితంగా పొందండి!"

We don’t spam! Read our privacy policy for more info.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🌱 పర్యావరణ వార్తలు వెంటనే తెలుసుకోండి!

Green Mobility, Solar, EV, Environment కి సంబంధించిన తాజా వార్తలు కోసం Harithamitra ను Follow అవ్వండి.

♻️ Harithamitra – పర్యావరణానికి మీ డిజిటల్ మిత్రుడు