Home » హైదరాబాద్ లో Bounce Infinity టెస్ట్ రైడ్స్‌

హైదరాబాద్ లో Bounce Infinity టెస్ట్ రైడ్స్‌

Bounce-Infinity-E1
Spread the love

మార్చి 15న హైద‌రాబాద్‌లో అందుబాటులోకి..

Bounce Infinity ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ కోసం వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వీరి కోసం ఇన్ఫినిటీ కంపెనీ తన బౌన్స్ ఎలక్ట్రిక్ E1  స్కూటర్కో కోసం  టెస్ట్ రైడ్ ల తేదీలను ప్రకటించింది. టెస్ట్ రైడ్‌లు పరీక్షించాలనుకునే వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి.

Bounce infinitely electric scooter

మొదటి దశలో బెంగుళూరు, ఢిల్లీ NCR, ముంబై, హైదరాబాద్, పూణె, చెన్నై, కొచ్చి వంటి నగరాల్లో బౌన్స్ టెస్ట్ రైడ్‌లకు అవ‌కాశం క‌ల్పిస్తోంది. బౌన్స్ ఇన్‌ఫినిటీ స్కూటర్‌లు ఈ నగరాల్లోని మ‌ల్టీ టచ్‌పాయింట్‌లలో అందుబాటులో ఉంటాయి. Bounce Infinity E1ని ఎక్స్‌పీరియ‌న్స్ వేచి ఉన్నవారికి బౌన్స్ టెస్ట్ రైడ్‌లను అందించగల‌మ‌ని కంపెనీ చెబుతోంది.

15న హైదరాబాద్ లో..

బెంగుళూరులో టెస్ట్ రైడ్‌లు ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభమవుతాయి. ఆ తర్వాత మార్చి 4వ తేదీన ఢిల్లీ NCR, మార్చి 10వ తేదీన కొచ్చిలో టెస్ట్ రైడ్‌లు ప్రారంభమవుతాయి. ముంబై, పూణే, చెన్నై, హైదరాబాద్‌లలో రైడ్‌లు మార్చి 15న ప్రారంభమవుతాయి. రాబోయే కొద్ది వారాల్లో మరిన్ని నగరాలను చేర్చుతామని కంపెనీ పేర్కొంది.

ఆసక్తి ఉన్న వినియోగదారులు తమ టెస్ట్ రైడ్ స్లాట్‌లను బౌన్స్ ఇన్ఫినిటీ వెబ్‌సైట్‌లో రిజర్వ్ చేసుకోవచ్చు. రాబోయే కొద్ది వారాల్లో మరిన్ని నగరాల్లో టెస్ట్ రైడ్‌లను ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

బౌన్స్ కంపెనీ దాని

బ్యాటరీ స్వాపింగ్ నెట్‌వర్క్‌ను ఇటీవల ప్రారంభించింది. డిసెంబరు 2వ తేదీన విడుదలైన ఈ స్కూటర్, ‘బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్’ ఆప్షన్‌తో వస్తుంది. అంటే బ్యాట‌రీ లేకుండానే బైక్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇలా కొనుగోలు చేస్తే బౌన్స్ ఎల‌క్ట్రిక్ వారి స్వాపింగ్ స్టేష‌న్ల ద్వారా బ్యాట‌రీని అద్దె ప్రాతిప‌దిక‌న తీసుకొని మార్చుకోవ‌చ్చు. బౌన్స్ ఇన్ఫినిటీ E1 బ్యాటరీతో కూడా అందుబాటులో ఉంటుంది. దీనిని స్కూటర్ నుంచి విడ‌దీసి కస్టమర్‌లు వారి ఇల్లు లేదా కార్యాలయంలో లేదా సౌకర్యవంతంగా ఎక్కడైనా ఛార్జ్ చేయవచ్చు. ఇది సాంప్రదాయ స్కూటర్‌లతో పోలిస్తే స్కూటర్ రన్నింగ్ ఖర్చులను గణనీయంగా 40% వరకు తగ్గిస్తుంది.


మరిన్ని అప్‌డేట్‌ల కోసం హ‌రిత‌మిత్ర వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.

ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు సంబంధించిన వీడియోల కోసం మా  Haritha mithra YouTube ఛానెల్‌ను స‌బ్‌స్క్రైబ్ చేసుకోండి.!

2 thoughts on “హైదరాబాద్ లో Bounce Infinity టెస్ట్ రైడ్స్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *