Rythu Nestham : ఇక పొలాల నుండే లైవ్ ప్రసారాలు.. అధికారులకు మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు!

Rythu Nestham : ఇక పొలాల నుండే లైవ్ ప్రసారాలు.. అధికారులకు మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు!

హరిత్రమిత్ర: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం జరిగిన ‘రైతు నేస్తం’ (Rythu Nestham) కార్యక్రమంలో పాల్గొని క్షేత్రస్థాయి రైతుల అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. తేనెటీగల పెంపకంతో అధిక ఆదాయం పొందుతున్న రైతులను అలాగే ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులను మంత్రి తుమ్మల అభినందించారు.

పొలాల నుండే ప్రత్యక్ష ప్రసారాలు

రైతు నేస్తం కార్యక్రమం మరింత సమర్థవంతంగా ఉండాలని మంత్రి సూచించారు.

  • ప్రతి మంగళవారం నిర్వహించే అంశాలను ముందుగానే నిర్ణయించాలి.
  • కేవలం చర్చలే కాకుండా, ఎంపిక చేసిన అంశాలకు సంబంధించిన రైతుల అనుభవాలను పొలాల నుండే ప్రత్యక్షంగా (Live) ఇతర రైతులు చూసేలా ఏర్పాట్లు చేయాలి.
  • ఈ కార్యక్రమానికి ఎక్కువ మంది రైతులు హాజరయ్యేలా ముందస్తు ప్రచారం మరియు సమన్వయం చేయాలని అధికారులను ఆదేశించారు.

యూరియా యాప్ పట్ల సంతృప్తి

ప్రభుత్వం తీసుకొచ్చిన ‘యూరియా యాప్’ అమలుపై మంత్రి స్వయంగా రైతులను ప్రశ్నించారు. యూరియా లభ్యత మరియు పారదర్శకమైన సరఫరా పట్ల రైతులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. సమయానికి ఎరువులు అందడం వల్ల సాగు సులభతరమైందని రైతులు మంత్రితో పంచుకున్నారు.

అదర్శ రైతులకు అభినందన

వినూత్న వ్యవసాయ పద్ధతులతో రాణిస్తున్న రైతులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా అభినందించారు. తేనెటీగల పెంపకంతో అధిక ఆదాయం సాధిస్తున్న జగిత్యాల జిల్లా పూడూరు రైతు రామకృష్ణను ప్రశంసించారు. ప్రకృతి సేద్యంతో లాభాలు పొందుతున్న రంగారెడ్డి జిల్లా రైతు శివను మంత్రి అభినందించారు. ఇలాంటి విజయగాథలను మిగతా రైతులు కూడా అనుసరించేలా అధికారులు ప్రోత్సహించాలని పేర్కొన్నారు.

శాస్త్రవేత్తల సూచనలు

ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు నిపుణులు కీలక అంశాలపై అవగాహన కల్పించారు.

  • నానో యూరియా: ఇఫ్కో స్టేట్ మేనేజర్ కృపా శంకర్ నానో యూరియా వాడకం, దాని ప్రయోజనాలపై వివరించారు.
  • సస్యరక్షణ: యాసంగి వరిలో వచ్చే పురుగులు, తెగుళ్ల నివారణపై PJTSAU శాస్త్రవేత్తలు డాక్టర్ కిరణ్ బాబు, డాక్టర్ అరుణశ్రీ సూచనలు చేశారు.

కంది కొనుగోలు కేంద్రాల ప్రారంభం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి పాల్గొన్నారు.


మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.  

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. న్యూస్ అప్డేట్స్  కోసం  X , ఫేస్​బుక్​ పేజీ, వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Harithamithra

👉 “Eco friendly & environmental news updates for Free”

వ్యవసాయం, సోలార్​​ ఎనర్జీ, గ్రీన్​ మొబలిటికి సంబంధించిన అప్‌డేట్స్​ను ఉచితంగా పొందండి!"

We don’t spam! Read our privacy policy for more info.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🌱 పర్యావరణ వార్తలు వెంటనే తెలుసుకోండి!

Green Mobility, Solar, EV, Environment కి సంబంధించిన తాజా వార్తలు కోసం Harithamitra ను Follow అవ్వండి.

♻️ Harithamitra – పర్యావరణానికి మీ డిజిటల్ మిత్రుడు