భారతదేశంలో స్టేషన్-ఆధారిత సైకిల్-షేరింగ్ రెంటల్ సర్వీస్ అయిన MYBYK కొత్తగా 2 ఎలక్ట్రిక్ సైకిల్ వేరియంట్‌లను ప్రారంభించింది.ఇందులో MYBYK ఎలక్ట్రిక్, MYBYK ఎలక్ట్రిక్ కార్గో వేరియంట్స్ ఉన్నాయి. . MYBYK ఎలక్ట్రిక్ సాధారణ ప్రజలు. పర్యాటకులకు మొదటి, లాస్ట్ మైల్ కనెక్టివిటీని పరిష్కరించే లక్ష్యంతో ఉండగా, రెండోది MYBYK ఎలక్ట్రిక్ కార్గో గిగ్ వర్కర్ల కోసం చివరి-మైలు డెలివరీ కోసం నిర్దేశించినది.
MYBYK 6 భారతీయ నగరాల్లో 10,000 కంటే ఎక్కువ పెడల్ సైకిల్ ఆధారిత పబ్లిక్ బైక్ షేరింగ్ సిస్టమ్‌ను నిర్వహిస్తోంది. ఇప్పుడు అది ఇంటర్నల్‌గా అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ సైకిళ్ల (electric bicycles) తో ఎలక్ట్రిక్ మొబిలిటీ స్పేస్‌లోకి ప్రవేశిస్తోంది. MYBYK యాప్‌తో బ్లూటూత్‌తో కనెక్ట్ చేయబడిన బైక్ ఎక్స్‌పీరియన్స్, కీలెస్ సైకిల్ అన్‌లాకింగ్, కీలెస్ బ్యాటరీ అన్‌లాకింగ్ వంటి సౌకర్యాలను పొందవచ్చు. అలాగే పరిస్థితులను బట్టి 80-100 కిమీల రేంజ్‌ను అందించే 0.54 KwH సామర్థ్యం కలిగిన కోసం స్వాపబుల్ బ్యాటరీ వంటి అనేక ఫీచర్లను ఈ electric bicycles (ఎలక్ట్రిక్ బైక్ ) కలిగి ఉంది.
electric bicycles లాంచ్‌పై MYBYK వ్యవస్థాపకుడు & CEO అయిన అర్జిత్ సోనీ మాట్లాడుతూ “MYBYK ఎలక్ట్రిక్‌తో, తాము వినియోగదారులకు ఆరోగ్యం + ప్రయాణాలు + సౌలభ్యాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. తమ ఎలక్ట్రిక్ సైకిళ్లు వినియోగదారులకు ఆరోగ్యం తోపాటు, విశ్రాంతి కోసం పెడల్ సైక్లింగ్ చేయగల అన్ని ప్రయోజనాలను అందిస్తాయని పేర్కొన్నారు. అలాగే ప్రయాణ ప్రయోజనాల కోసం తక్కువ వేగంతో నడిచే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందిస్తాయని, సాహసోపేతమైన వారి కోసం ‘పవర్ పెడల్’ మోడ్‌ని కలిగి ఉంటుందని తెలిపారు. వినియోగదారులు పెడల్ చేసినప్పుడు బూస్ట్ ఇస్తుంది, వారి ప్రయత్నాన్ని 80 శాతం వరకు తగ్గిస్తుందని వివరించారు.