కొత్త డిజైన్, అధునాతన ఫీచర్లతో 2026లో మార్కెట్లోకి
Chetak 2026 Launch : ఎలక్ట్రిక్ వాహన రంగంలో బజాజ్ ఆటో మరోసారి సంచలనానికి సిద్ధమవుతోంది . చేతక్ 35 సిరీస్, 30 సిరీస్‌ల గ్రాండ్ సక్సెస్ తర్వాత కంపెనీ ఇప్పుడు నెక్స్ట్-జెనరేషన్ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇటీవల స్పై ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో ఈ కొత్త మోడల్ రూపురేఖలు వెలుగులోకి వచ్చాయి. అయితే కంపెనీ అధికారిక లాంచ్ తేదీని ప్రకటించనప్పటికీ, 2026లో ఈ నెక్స్ట్-జెన్ చేతక్ భారత రోడ్లపైకి రానుందనే అంచనా వేస్తున్నారు. .
డిజైన్‌లో కాస్త కొత్తదనం
స్పై షాట్ల ప్రకారం, కొత్త చేతక్ డిజైన్ క్లాసిక్ సిల్హౌట్‌ను కొనసాగిస్తూనే ఆధునికతను జోడించింది. వెనుక LED టెయిల్ లైట్లు, టర్న్ ఇండికేటర్లు, నంబర్ ప్లేట్ హోల్డర్ కొత్తగా కనిపిస్తున్నాయి. వెనుక టైర్ హగ్గర్ జోడించబడింది. ఛార్జింగ్ పోర్ట్ స్థానం ఇప్పుడు ముందువైపు ఆప్రాన్ ప్రాంతంలో ఉండే చాన్స్ ఉంది. కామౌఫ్లాజ్ కారణంగా సైడ్ ప్యానెల్స్ వివరాలు స్పష్టంగా కనిపించకపోయినా, అవి సవరించబడ్డట్లు అనిపిస్తోంది. గ్రాబ్ రైల్, సీటు డిజైన్ మరింత చదునుగా, కంఫర్ట్ దృష్టితో మలచబడింది.
ఈ టెస్ట్ మ్యూల్ మోడల్ మిడ్-లెవల్ వేరియంట్‌గా భావిస్తున్నారు. ఇందులో ముందు భాగంలో డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో హబ్ మోటార్ ఉన్నప్పటికీ, ఫ్లాగ్‌షిప్ మోడళ్లలో ఉండే TFT డిస్‌ప్లే, కీలెస్ ఎంట్రీ, హై-ఎండ్ సస్పెన్షన్ సెటప్ ఇందులో లేవు. ఇదిలా ఉండగా, కొత్త LCD క్లస్టర్, మారిన స్విచ్ గేర్, ట్విన్ టెలిస్కోపిక్ ఫోర్క్స్, ట్విన్ రియర్ షాక్స్ వంటి సాంకేతిక మార్పులు చేతక్‌కు మరింత స్థిరత్వం అందించనున్నాయి.
పవర్‌ట్రెయిన్ & రేంజ్ ఎలా ఉంటుంది?
బజాజ్ ఈ మోడల్‌కు 3 kWh లేదా 3.5 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఒకే ఛార్జ్‌పై 150 కి.మీ వరకు రేంజ్ ఇవ్వనుందని భావిస్తున్నారు. ఇది బజాజ్ చేతక్‌ను ఎలక్ట్రిక్ 2W సెగ్మెంట్‌లో మరింత పోటీగా చాన్స్ అవకాశం ఉంది.


