Thursday, July 3Lend a hand to save the Planet
Shadow

Northern Giant Hornet | వ్యవసాయానికి పెను ముప్పుగా మారిన కందిరీగలకు చెక్ పెట్టిన అమెరికా

Spread the love

Northern Giant Hornet | హార్నెట్‌లు ( వెస్పా జాతికి చెందిన కీటకాలు ) కందిరీగలలో అతిపెద్దవి. ఇవి తేనెటీగలను వేటాడి తినే కీట‌కం. దీనిని ‘ మర్డర్ హార్నెట్ అని కూడా పిలుస్తారు. అయితే తేనెటీగ‌ల మ‌నుగ‌డ‌కే ప్ర‌మాద‌క‌రంగా మారిన మర్డర్ హార్నెట్‌ (Murder Hornet) వ్యవసాయానికి పెను ముప్పుగా మారిన కందిరీగలకు చెక్ పెట్టిన అమెరికా)ను నిర్మూలించేందుకు అమెరికా అనేక సంవత్స‌రాలుగా శ్ర‌మిస్తోంది. ఎట్ట‌కేల‌కు హార్నెట్ ను పూర్తిగా సంహ‌రించిన‌ట్లు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధికారికంగా ప్ర‌క‌టించింది. మూడు సంవత్సరాలుగా హార్నెట్ (వెస్పా మాండరినియా) కు సంబంధించి ఎటువంటి ఆట‌వాళ్లు క‌నిపించ‌లేద‌ని అధికారులు ప్రకటించారు.

వాషింగ్టన్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (WSDA), యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (USDA) హార్నెట్ (northern giant hornet ) ఇప్పుడు దేశంలో లేదని ధృవీకరించాయి. ఆసియాకు చెందిన ఈ కీట‌కం తేనెటీగ ( honey bees colony ) కాలనీలకు తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది. ఇది గంటల్లో తేనెటీగ‌ల‌ను నాశనం చేయగలదు. అంతేకాకుండా పరాగ సంపర్కాలపై ఆధారపడిన పంటలను పరోక్షంగా దెబ్బతీస్తుంది.

రెండు అంగుళాల పొడవు, నార్తర్న్ గెయింట్ హార్నెట్‌లు భయంకరమైన మాంసాహారులు. ఇవి తేనెటీగ కాలనీలపై దాడి చేయడానికి తమ శక్తివంతమైన మాండబుల్స్‌ను ఉపయోగిస్తాయి. ఒక్క దాడితో 90 నిమిషాల్లో తేనెటీగ కాలనీని పూర్తిగా నాశనం చేస్తుంది. ఈ హార్నెట్‌లు సాధారణంగా మనుషులను రెచ్చగొట్టకపోతే తప్పించుకుంటాయి. వాటి స్టింగ్ తేనెటీగలు కంటే ఎక్కువ శక్తివంతమైనది.

2019 ఆగస్టులో కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలో ఉత్తర అమెరికాలో మొదటిసారిగా కనుగొనబడిన హార్నెట్‌లు ఆ త‌ర్వాత‌ సంవత్సరం వాషింగ్టన్ రాష్ట్రంలో గుర్తించారు.

అయితే ఈ నార్త‌ర్న్ గెయింట్ హార్నెట్ నిర్మూలనతో వ్యవసాయానికి ఎంతో మేలు చేసిన‌ట్లుగా భావిస్తున్నారు. పండ్లు, కూరగాయలతో సహా అనేక రకాల పంటల ఉత్ప‌తిలో అత్యంత కీల‌క‌మైన పుష్పాల‌ పరాగసంపర్కం చేయడానికి తేనెటీగలు ఎంతో అవసరం. అవి వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు బిలియన్ల డాలర్ల మేలు చేస్తాయి. అయితే మ‌ర్డ‌ర్‌ హార్న‌ట్ నిర్మూలించ‌డం ద్వారా అధికారులు పర్యావరణ సమతుల్యతను కాపాడారు. తేనెటీగ‌ల‌కు గ‌ల ప్ర‌మాదాన్ని నివారించారు. ఈ విజయం ఆహార ఉత్పత్తికి పరాగ సంపర్కాలపై ఆధారపడే పర్యావరణ వ్యవస్థల ఆరోగ్యానికి దోహ‌దం చేస్తుంది.


హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *