బెంగుళూరు : భారత్ లో అతిపెద్ద ఈవీ కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ తన ‘బాస్’ ఆఫర్లలో భాగంగా దీపావళి పర్వదినం సందర్భంగా అతిపెద్ద ఓలా సీజన్ సేల్ క్యాంపేయిన్ 72 గంటల రష్ (72 hours Rush)ని ప్రకటించింది. ఈ ఆఫర్ కింద కొనుగోలుదారులు ఓలా S1 పోర్ట్‌ఫోలియోపై రూ.25,000 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. స్కూటర్‌లపై రూ.30,000 వరకు విలువైన అదనపు ప్రయోజనాలను కూడా పొందొచ్చు. కొనుగోలుదారులు ఈ ఆఫర్లను 31 అక్టోబర్, 2024 వరకు పొందవచ్చు
‘BOSS’ క్యాంపేయిన్ కింద ప్రయోజనాలు
- ‘బాస్’ ధరలు: ఓలా S1 పోర్ట్‌ఫోలియో కేవలం రూ.74,999 నుంచి ప్రారంభమవుతుంది
- ‘బాస్’ డిస్కౌంట్స్ : మొత్తం S1 పోర్ట్‌ఫోలియోపై గరిష్టంగా ₹25,000 వరకు లభిస్తుంది.
- రూ. 30,000 వరకు అదనంగా ‘బాస్’ ప్రయోజనాలు:
- ‘బాస్’ వారంటీ: రూ.7,000 విలువైన 8-సంవత్సరాలు/80,000 km బ్యాటరీ వారంటీ ఉచితం
- ‘బాస్’ ఫైనాన్స్ ఆఫర్లు: ఎంచుకున్న క్రెడిట్ కార్డ్ ఈఎంఐలపై ₹5,000 వరకు ఫైనాన్స్ ఆఫర్‌లు
- ‘బాస్’ ప్రయోజనాలు: రూ.6,000 విలువైన Move OS+ అప్‌గ్రేడ్;
- ₹7,000 వరకు విలువైన ఉచిత ఛార్జింగ్ క్రెడిట్‌లు
- బాస్ ఎక్స్ఛేంజ్ ఆఫర్లు: S1 పోర్ట్‌ఫోలియోపై రూ.5,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్లు
ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఈవీ వ్యాప్తిని మరింతగా పెంచడానికి విక్రయానంతర యాజమాన్య అనుభవాన్ని మెరుగుపరచాలని ఓలా ఎలక్ట్రిక్ గత కొన్ని వారాల్లో వరుస కార్యక్రమాలను ప్రకటించింది. సాంకేతికతతో కూడిన, అత్యుత్తమ స్థాయి విక్రయాల అనుభవాన్ని అందించడంపై దృష్టి సారించి #హైపర్‌సర్వీస్ ప్రచారాన్ని కంపెనీ ప్రారంభించింది. ఈ క్యాంపెయిన్ లో భాగంగా, కంపెనీ తన కంపెనీ యాజ మాన్యంలోని సర్వీస్ నెట్‌వర్క్‌ను డిసెంబర్ 2024 నాటికి 1,000 కేంద్రాలకు రెట్టింపు చేయనుంది.
అంతేగాకుండా తన నెట్‌వర్క్ పార్టనర్ ప్రోగ్రామ్‌లో భాగంగా, కంపెనీ 2025 చివరి నాటికి సేల్స్, సర్వీస్‌లలో 10,000 మంది భాగస్వాములను చేర్చుకోనుంది. భారతదేశం అంతటా ప్రతీ మెకానిక్ కూడా ఈవీలకు సన్నద్ధంగా ఉండేలా చేసేందుకు వీలుగా 1 లక్ష మంది థర్డ్-పార్టీ మెకానిక్‌లకు శిక్షణ ఇచ్చే లక్ష్యంతో కంపెనీ తన ఈవీ సర్వీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రకటించింది.
మరోవైపు Ola Electric విభిన్నమైన అవసరాలు కలిగిన కస్టమర్‌ల కోసం ఆకర్షణీయమైన ధరల పాయింట్‌లలో ఆరు ఆఫర్‌లతో విస్తృతమైన S1 పోర్ట్‌ఫోలియోను అందిస్తుంది. ప్రీమియం ఆఫర్‌లు ఓలా S1 Pro మరియు ఓలా S1 ఎయిర్‌ల ధర వరుసగా ₹1,34,999 మరియు ₹1,07,499. ఇక మాస్ మార్కెట్ ఆఫర్‌లలో S1 X పోర్ట్‌ఫోలియో (2 kWh, 3 kWh మరియు 4 kWh) ధరలు వరుసగా ₹74,999, ₹87,999. ₹101,999.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..