Ola Electric Scooter | ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త.. దేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ అయిన ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తన ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీగా ధరను తగ్గించేసింది. ఓలా ఎస్ 1ఎక్స్ మోడల్ ధర రూ.79 వేల 999 ఉండగా, దానిపై 12.5 శాతం తగ్గిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. దీంతో ఓలా బేసిక్ వేరియంట్ రూ.69,999 వేలకు అందుబాటులోకి రానుంది. గతంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలళ్లను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ పథకాలను అమలుచేసింది. ఆ తర్వాత సబ్సిడీపై కోతలు విధిస్తూ వచ్చింది. దీంతో ఈవీల అమ్మకాలు క్రమంగా తగ్గాయి. ఈ నేపథ్యంలో ఓలా కంపెనీ తన వాహనాల విక్రయాలను పెంచుకునేందుకు ఓలా కంపెనీ ధరలను తగ్గించింది.
2024లో బెంగళూరుకు చెందిన ఓలా కంపెనీ 3,26,443 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. నిజానికి మూడు లక్షల వాహనాలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకోగా దానిని అధిగమించింది. ఇదిలా ఉండగా ఈవీ మార్కెట్ లో ప్రముఖ బ్రాండ్లు అయిన టీవీఎస్ మోటార్, అథర్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలు రూ.లక్షకు పైగానే ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్‌లో అత్యంత పాపులర్ అయిన హోండా యాక్టివా పెట్రోల్ స్కూటర్ కంటే తక్కువగా ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. తమ వాహనాల అమ్మకాలను పెంచేందుకు ఓలా ఎలక్ట్రిక్ బేసిక్ స్కూటర్ ధరను ఇటీవల కాలంలో భారీగా తగ్గిస్తూ వస్తోంది. మిగిలిన వేరియంట్లపై కూడా 5.6 శాతం నుంచి 9.1 శాతం వరకు ధరలను తగ్గించింది.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..