అద్భుతమైన ఫెస్టివల్ ఆఫర్స్ తో ‘ఓలా భారత్ ఈవి ఫెస్ట్‌’ ని ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్

Spread the love

రూ 24,500 వరకు ఆఫర్‌లు

ప్రతిరోజూ ఒక S1X+ గెలుచుకునే అవకాశం

బెంగళూరు: భారతదేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ అక్టోబర్ 16 నుంచి దేశవ్యాప్తంగా ఓలా భారత్ ఈవి(EV) ఫెస్ట్‌ని ప్రకటించింది. పండగ సీజన్ కోసం దేశం సన్నద్ధమవుతున్న తరుణంలోఓలా భారతదేశంలోనే అతిపెద్ద 2ఈవి(EV) ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ తోపాటు.. డిస్కౌంట్‌లుబ్యాటరీ హామీ పథకాలు, మరెన్నో అద్భుతమైన ఆఫర్‌లతో  కస్టమర్ల ముందుకు వచ్చింది.

Ola Ev Eest లో భాగంగాకొనుగోలుదారులు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుపై 24,500 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. 5 సంవత్సరాల బ్యాటరీ వారంటీ (రూ. 7,000 వరకు విలువైనది*)ఎక్స్‌ఛేంజ్ బోనస్‌లు (రూ. 10,000* వరకు), నో-కాస్ట్ EMI (భాగస్వామి బ్యాంకుల నుండి 7,500* వరకు తగ్గింపు) వంటి ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ పథకాలు కస్టమర్లు పొందవచ్చు. ఈ ఫెస్ట్ కాలంలో ఓలా స్కూటర్‌ని టెస్ట్-రైడింగ్ చేసే కస్టమర్‌లు ఇతర అద్భుతమైన బహుమతులతో పాటు ప్రతిరోజూ ఒక S1X+ని గెలుచుకునే అవకాశాన్ని పొందవచ్చు.

ఓలా ఎలక్ట్రిక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ మాట్లాడుతూ, “  పండగ సీజన్ లో భారత్ ఈవి(EV) ఫెస్ట్‌ను ప్రారంభించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. 2సెగ్మెంట్‌లో #EndICEAge నిబద్ధతతో కట్టుబడి ఉన్నాముఅందులోభాగంగానే మేము ఈ వేడుకను ప్రకటించాము. భారత్ ఈవి(EV) ఫెస్ట్ తో ప్రజలు ఈ దివాళీ పండుగ సందర్బంగా ఈవి(EV)కి మారడానికి సరైన అవకాశం. కొనుగోలుదారులు  మా ఎక్స్పీరియన్స్ కేంద్రాలను సందర్శించిఓలా స్కూటర్లను టెస్ట్ రైడ్ చేయవచ్చు.”

5-ఇయర్స్ బ్యాటరీ ప్రామిస్

Ola Ev Eest తమ కస్టమర్ల కాన్ఫిడెన్స్ పెంపొందిస్తూ, ఓలా “5- ఇయర్స్ బ్యాటరీ ప్రామిస్” ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది . కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ ప్రాడక్ట్ S1 ప్రో (2వ జనరేషన్)పై ఉచిత 5 సంవత్సరాల ఎక్స్టెండెడ్ బ్యాటరీ వారంటీని అందిస్తోంది. S1 ఎయిర్‌ కొన్నవారికి  ఎక్స్టెండెడ్ బ్యాటరీ వారంటీ పై 50% తగ్గింపును అందిస్తోంది.

ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్

ఓలా తమ ~1000 ఎక్స్పీరియన్స్ కేంద్రాలలో అతిపెద్ద ICE-to-EV ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తోంది . కస్టమర్లు ఇప్పుడు తమ పాత ICE 2Wని మార్చుకోవచ్చు. ఓలా స్కూటర్ కొనుగోలుపై రూ 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు.

లక్కీ-బూట్ ఆఫర్లు

ఓలా తన కస్టమర్ల కోసం అనేక అద్భుతమైన ఆఫర్లను కూడా ప్రకటించింది. కస్టమర్‌లు ఏదైనా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఓలా స్కూటర్‌ని టెస్ట్-రైడ్ చేయవచ్చు. ప్రతిరోజు S1X+ని గెలుచుకునే అవకాశం పొందవచ్చు. అంతేకాకుండా, ఉచిత మర్చండైస్, ఇతర అద్భుతమైన బహుమతులు, ఓలా కేర్+ డిస్కౌంట్ కూపన్‌లు మరియు అన్ని కొత్త S1 ప్రో (2వ జనరేషన్) పై తక్షణ తగ్గింపులు కూడా పొందవచ్చు.

ఫైనాన్స్ ఆఫర్‌లు

అనేక ఆఫర్‌లతో పాటుకొనుగోలుదారులు ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్ EMIలపై రూ 7,500 వరకు తగ్గింపులను కూడా పొందవచ్చు. వినియోగదారులు ఇప్పుడు 5.99% తక్కువ వడ్డీ రేట్లతో జీరో డౌన్ పేమెంట్, జీరో-ప్రాసెసింగ్ ఫీజుతో ఓలా స్కూటర్‌ని ఇంటికి తీసుకెళ్లవచ్చు.

రెఫరల్ స్కీమ్

అక్టోబర్ 24 వరకు ఓలా తన కమ్యూనిటీ సభ్యులకు వారి స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఓలా స్కూటర్‌ను రిఫర్ చేస్తే రివార్డ్ అందజేస్తుంది. రిఫరర్‌కి ఉచిత ఓలా కేర్+ ప్రతి రెఫరల్‌కు రూ 2000 వరకు క్యాష్‌బ్యాక్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఈ కొత్త పథకం ప్రకారంరిఫరీలు విజయవంతంగా కొనుగోలు చేసిన తర్వాత ₹1,000 క్యాష్‌బ్యాక్‌ను కూడా అందుకుంటారు.

రూ. 1,47,499 ధరతో, SPro (2వ జనరేషన్) డెలివరీలు గత వారం 100 కంటే ఎక్కువ నగరాల్లో ప్రారంభమయ్యాయిఅదేవిధంగా, S1 ఎయిర్ ₹1,19,999 కి అందుబాటులో ఉంది. ఓలా ఎలెక్ట్రిక్ అదనంగా విభిన్న ప్రాధాన్యతలతో రైడర్‌ల అవసరాలను తీర్చడానికి ICE-కిల్లర్ ప్రాడక్ట్ S1Xని మూడు వేరియంట్‌లలో ప్రవేశపెట్టింది – SX+, SX (2kWh), SX (3kWh) . SX+ ఇప్పుడు రూ 1,09,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. SX (3kWh), SX (2kWh) కోసం ప్రీ-రిజర్వేషన్ విండో ఇప్పుడు రూ 999 వద్ద మాత్రమే తెరవబడింది. S1 X (3kWh) మరియు S1 X (2kWh) స్కూటర్‌లు రూ 99,999, రూ.89,999 ప్రారంభ ధరలో అందుబాటులో ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..