
Ola S1 Pro Plus vs Simple One | సింపుల్ ఎనర్జీ అప్‌డేట్ చేసిన తన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఇటీవలే విడుదల చేయడంతో స్పోర్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో పోటీ మరింత హీటెక్కింది. కొత్త EV మెరుగైన రేంజ్, పనితీరును అందిస్తుంది. ఇది దాని పోటీదారులకు నిద్రలేని రాత్రులను ఇవ్వవచ్చు. అయితే కొత్తగా వచ్చిన సింపుల్ వన్ ఈవీ.. కొత్త ఓలా S1 ప్రో ప్లస్‌తో పోటీ పెడితే ఏది ఉత్తమమో ఓసారి అంచనా వేద్దాం..
Ola S1 Pro Plus vs Simple One : పనితీరు, రేంజ్
సింపుల్ వన్ 5 kW బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది 11.3 bhp శక్తిని, 72 Nm టార్క్‌ను ఉత్ప త్తి చేస్తుంది. IDC రేంజ్ ఆధారంగా 2025 సింపుల్ వన్ 248 కి.మీ మైలేజీ ఇస్తుంది. మునుపటి మోడల్ 212 కి.మీ పరిధిని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. సింపుల్ ఎనర్జీ ప్రకారం, స్కూటర్ 2.77 సెకన్లలో 0 – 40 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది గంటకు 105 కి.మీ వేగంతో దూసుకుపోతుంది.
ఓలా ఎలక్ట్రిక్ ఇటీవలే S1 శ్రేణిలో థర్డ్ జనరేషన్ ఈవీ స్కూటర్ ను విడుదల చేసింది. 4680 భారత్ సెల్స్‌తో 5.3 kWh బ్యాటరీని పొందే టాప్ మోడల్ S1 Pro+ని పరిశీలిస్తే.. IDC ప్రకారం, ఇది 320 కి.మీ.ల పరిధిని అందిస్తుంది. ఇది 17.4 bhpతో అద్భుతమైన శక్తినిస్తుంది. 2.1 సెకన్లలో 0 నుండి 40 కి.మీ.ల వేగాన్ని అందుకుంటుంది. గంటకు 141 కి.మీ.ల గరిష్ట వేగం ప్రయాణిస్తుంది.
ఓలా S1 ప్రో ప్లస్ vs సింపుల్ వన్: ఫీచర్లు
సింపుల్ వన్ 7-అంగుళాల డిజిటల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో రియల్-టైమ్ డేటా, రిమోట్ యాక్సెస్, రైడ్ స్టాటిస్టిక్స్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఇది ఇంటర్నల్ టర్న్-బై-టర్న్ మ్యాప్స్, ఆటో-బ్రైట్‌నెస్, రీజెనరేటివ్ బ్రేకింగ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 30-లీటర్ అండర్-సీట్ స్టోరేజ్‌తో వస్తుంది. సింపుల్ ఎనర్జీ రైడ్ మోడ్‌లను కూడా అప్‌డేట్ చేసింది.
ఓలా S1 ప్రో+ డ్యూయల్ ABS, ముందు, వెనుక చక్రాలపై ట్విన్ డిస్క్ బ్రేక్‌లు, మెరుగైన స్టాపింగ్ పవర్ కోసం బ్రేక్-బై-వైర్ టెక్నాలజీ వంటి క్లాస్-లీడింగ్ ఫీచర్లను కలిగి ఉంది . రైడర్లు హైపర్, స్పోర్ట్స్, నార్మల్, ఎకో అనే నాలుగు రైడింగ్ మోడ్‌ల నుంచి ఎంచుకోవచ్చు.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..