భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు కూడా కస్టమర్ల అభిరుచి మేరకు సరికొత్త వాహనాలను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. తాజాగా బెంగళూరు కు చెందిన Orxa ఎనర్జీస్ (Orxa Energies) సంస్థ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ మాంటిస్ ను (Mantis) లాంచ్ చేసింది. ఈ మాంటిస్ ఎలక్ట్రిక్ బైక్ 11.5 కిలోల బరువు కలిగిన లిక్విడ్ కూల్డ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఈ బైక్ మోటారు 93Nm టార్క్ ను జనరేట్ చేస్తుంది. కేవలం 8.9సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ బైక్ బుకింగ్ లు కూడా ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో మాంటిస్ డెలివరీలు మొదలవుతాయి.
డిజైన్, స్పెసిఫికేషన్స్
250cc సెగ్మెంట్ యూత్ ను ఆకట్టుకునేలా కొత్తగా ఓర్క్సా మాంటిస్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ లాంచ్ అయింది. దీని ధర(ఎక్స్-షోరూమ్ ధర) రూ. 3.60 లక్షలు. Orxa Mantis అనేది EV స్టార్టప్ నుంచి వచ్చిన మరొక ఉత్పత్తి మాత్రమే కాదు.. ఏరోస్పేస్ డిపార్ట్ మెంట్ లో అనుభవం ఉన్న సంస్థచే సంవత్సరాలుగా రూపొందించబడి అభివృద్ధి చేయబడిన మోటార్ సైకిల్ ఇది. మాంటిస్ ఆరు సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది.
మాంటిస్ ప్రస్తుత ద్విచక్ర వాహన రూపం 2017 నుంచి అభివృద్ధిలో ఉంది. Orxa Energies 2019లో ఇండియా బైక్ వీక్ (IBW)లో మాంటిస్ ను ప్రదర్శించింది, ఈ మోటార్ సైకిల్ భారతదేశం చుట్టూ ప్రయాణించి 13,510 కిలోమీటర్లు రికార్డును కూడా నెలకొల్పింది. IBWలో ప్రదర్శించబడిన ప్రొటోటైప్ నుంచి కూడా చాలా మార్పులు వచ్చాయి.
మునుపటి ప్రోటోటైప్ లతో పోలిస్తే, కొత్త మాంటిస్ లో బ్యాటరీ ప్యాక్ వంటి అనేక భాగాలను సర్దుబాటు చేసింది. ఇది ఇప్పుడు తేలికగా మారింది. ప్రొడక్షన్ వెర్షన్ లో అల్యూమినియం సబ్ ఫ్రేమ్ ను ఉపయోగించారు. ఇది మాంటిస్ ను మరింత చురుకైనదిగా చేయడానికి దోహదపడింది. ఇక లుక్స్ గురించి చెప్పాలంటే, మాంటిస్ ఒక కర్వ్ డిజైన్ ను కలిగి ఉంది. ట్యాంక్, స్ప్లిట్ సీట్లు, ట్విన్ హెడ్ లైట్ సెటప్, ప్రత్యేకమైన DRLతో మరింత అందాన్ని తీసుకువచ్చింది. టెలిస్కోపిక్ ఫోర్కులు, అల్లాయ్ వీల్స్, వెనుకవైపు మోనోషాక్, రెండు వైపులా డిస్క్ బ్రేక్ లు, LED లైటింగ్ కలిగి ఉంది. మినిమల్ బాడీవర్క్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
[table “4” not found /]
Orxa Mantis రేంజ్ 221కి. మీ
మాంటిస్ ఆల్-ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ 8.9kWh బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంది. అయితే కంపెనీ ప్రకారం IDC పరిధి ఒక్కసారి చార్జ్ చేస్తే 221కిమీ రేంజ్ ఇస్తుందని పేర్కొంది. Mantis కేవలం 8.9 సెకన్లలోనే 0-100 kmph వరకు వేగాన్ని అందుకుంటుంది. ఇక దీని స్పీడ్ విషయానికొస్తే గంటకు 135kmph వేగంతో దూసుకుపోతుంది.
3.3kW ఫాస్ట్ ఛార్జర్ ని ఉపయోగించి బ్యాటరీ ప్యాక్ ను కేవలం 2.5 గంటల్లో 0 నుంచి 80% వరకు ఛార్జ్ చేయవచ్చు.
ఎలక్ట్రిక్ బైక్ ను స్పోర్టీ మోడల్ ను కలిగి ఉంది. లైట్ వెయిట్.. తక్కువ బరువుతో ఉంటుంది. ఈ బైక్ బరువు 182 కిలోలు మాత్రమే.. ఈ ఎలక్ట్రిక్ బైక్ ను విమానాల తయారీలో ఉపయోగించే అల్యూమినియంతో తయారు చేశారు.. ఈ కారణంతో ఈ ఎలక్ట్రిక్ బైక్ తక్కువ బరువుతో ఉంది. 8 సంవత్సరాల కృషి ఫలితంగా ఈ బైక్ ను సిద్ధం చేసినట్లు సంస్థ పేర్కొంది. అహర్నిశలు శ్రమించి బైక్ అత్యత్తమంగా తయారు చేసినట్లు వెల్లడించింది.
బుకింగ్స్, డెలివరీలు..
Orxa కంపెనీ ఇప్పటికే బుకింగ్ లను ప్రారంభించింది. దాని అధికారిక వెబ్ సైట్ లో అందరికీ బుకింగ్ లను తెరిచింది. డెలివరీలు ఇంకా కొంత సమయం మాత్రమే ఉంది. ఏప్రిల్ 2024లో ప్రారంభం కానున్నాయి. మొదట బెంగళూరులో డెలివరీలు మొదలై ఆ తర్వాత మిగతా నగరాల్లో కూడా జరుగుతాయి. మాంటిస్ బుకింగ్‌లు ఇప్పుడు మొదటి 1000 మంది కస్టమర్‌లకు రూ.10,000కి తెరవబడ్డాయి. ఆ తర్వాత అది రూ.25,000కి పెరుగుతుంది.
ఈ బైక్ లకు గట్టి పోటీ
మాంటిస్’ ఇటీవల వచ్చిన అల్ట్రావయోలెట్ F77 ఎలక్ట్రిక్ బైక్ కు పోటీనిస్తుంది. ఇ పెట్రోల్ మోటార్‌సైకిళ్లతో పోల్చినప్పుడు.. ఇది KTM 250 డ్యూక్ వంటి వాటికి సమానమైన శక్తి, పనితీరు గణాంకాలను కలిగి ఉంటుంది. 2023 KTM 390 అడ్వెంచర్‌కి సమానమైన ధరను కలిగి ఉంది.
Green Mobility, Environment అప్ డేట్స్ కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..