FAME-II scheme : ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీని మూడేళ్ల వరకు పొడిగించాలి..

Spread the love

FAME-II scheme|దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (FAME-II) స్కీమ్‌ను మూడేళ్లపాటు పొడిగించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

మార్చి 31న FAME-II స్కీమ్ గడువు ముగుస్తుందనే ఊహాగానాల మధ్య ఈ సిఫార్సు రావడం ప్రధాన్యతను సంతరించుకుంది.. అనేక OEMలు, ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు  తయారీ పరిశ్రమలు ఈ పథకాన్ని పొడిగించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ పథకం కింద సబ్సిడీ భారీగా సబ్సిడీ ఇవ్వడం ద్వారా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను అమ్మకాలను ప్రోత్సాహించింది..

వాహనదారులను ఎలక్ట్రిక్ మొబిలిటీకి మల్లించేందుకు.. ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని కమిటీ అభిప్రాయపడింది.  FAME-II పథకాన్ని కనీసం 3 సంవత్సరాల    వరకు పొడిగించాలని సిఫార్సు చేసింది. స్కీమ్‌ను మరింత కలుపుకొని పోవడానికి పరిశ్రమల వాటాదారులతో మరిన్ని సంవత్సరాల పాటు సంప్రదింపులు జరపాలి” అని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు ఇచ్చిన నివేదికలో కమిటీ పేర్కొంది.

10 వేల కోట్లతో..FAME-II scheme

FAME–II పథకాన్ని రూ. 10,000 కోట్లతో,ప్రారంభించారు. 2022లో ముగించాలని నిర్ణయిచగా.. మార్చి 2024 వరకు పొడిగించారు.. ఈ పథకం మూడు చక్రాల వాహనాలే కాకుండా, ఒక మిలియన్  ద్విచక్ర వాహనాలకు మద్దతునివ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. నాలుగు చక్రాల వాహనాలు, బస్సులు, డిమాండ్ ప్రోత్సాహకాల కోసం 86 శాతం నిధులు కేటాయించారు.

11.80 లక్షల వాహనాలపై ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులకు మొత్తం రూ. 5,294 కోట్ల రాయితీలు అందించినట్లు మంత్రిత్వ శాఖ ఇటీవల పార్లమెంటులో సమర్పించిన నివేదిక వెల్లడించింది. ఈ పథకం కింద దాదాపు 10.42 లక్షల ద్విచక్ర వాహనాలు, 122,690 మూడు చక్రాల వాహనాలు, 14,869 నాలుగు చక్రాల వాహనాలకు సబ్సిడీ లభించింది.

గత జూన్‌లో, ప్రభుత్వం ఈ పథకం కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం సబ్సిడీని కిలోవాట్‌కు 10,000 రూపాయల నుండి 5,000 రూపాయలకు తగ్గించింది. ద్విచక్ర వాహనాలకు ప్రోత్సాహకాలపై పరిమితిని వాహనాల ఎక్స్-ఫ్యాక్టరీ ధరలో 40% నుండి 15%కి తగ్గించింది.

ద్విచక్ర వాహన విభాగానికి నిర్ణయించిన నిధులు ముగియడంతో సబ్సిడీ తగ్గించారు. సబ్సిడీని కొనసాగించడానికి ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాల పథకం వ్యయాన్ని రూ.2,000 కోట్ల నుంచి రూ.3,500 కోట్లకు ప్రభుత్వం సవరించింది.

ద్విచక్ర వాహనాలపై కోత విధించిన సబ్సిడీని పునరుద్ధరించాలని కమిటీ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఇతర ప్రధాన సిఫార్సులలో నాలుగు చక్రాల వాహనాల సంఖ్యను పెంచడం.. ప్రైవేట్ వాహనాలను డొమైన్ కిందకు తీసుకురావడం, ఇ-బస్ కేటగిరీకి ఎక్కువ కేటాయింపులు, బ్యాటరీ స్టాండర్డైజేషన్ యొక్క సాధ్యాసాధ్యాలపై అధ్యయనం, స్థిరమైన బ్యాటరీ మార్పిడి విధానం మరియు GST తగ్గింపును అన్వేషించడం వంటివి ఉన్నాయి. .

వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, అధికారులు, SMEV మరియు EV తయారీదారుల ప్రతినిధులు చేసిన సమర్పణల ఆధారంగా కమిటీ నివేదిక రూపొందించబడింది.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు,  జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.

అలాగే  న్యూస్  అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి   ట్విట్టర్,  ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..