Pure EV X Platform 2.0 | హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ ప్యూర్ EV.. తన పాపులర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్యూర్ ఈవీ ePluto 7G, ePluto 7G, 7జీ Pro, Max మోడళ్ల కోసం X ప్లాట్‌ఫారమ్ 2.0 లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ అప్ డేట్ తో కొత్త స్కూటర్లు మెరుగైన వేగం, మైలేజీని అందిస్తుంది.
X ప్లాట్‌ఫారమ్ 2.0 లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌లు X ప్లాట్‌ఫారమ్‌పై 12 ఫీచర్లను కలిగి ఉంటాయి. మరోవైపు, ప్యూర్ EV డ్రైవింగ్ మోడ్స్ లోని స్పీడ్ లిమిట్లను కూడా సవరించింది, ముఖ్యంగా ఎకో మోడ్‌లో స్కూటర్ మూడు వేరియంట్‌లలో 58 కి.మీ. వేగాన్ని చేరుకోగలదు.
కొత్త వాహనాల మైలేజీ కూడా పెరిగాయి. ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునేవారికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు వారి డిమాండ్ ను తీర్చగలదు. లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్లలో సవరించిన స్పోర్ట్స్ మోడ్‌ను పొందుపరిచింది. కొత్తగా స్పోర్ట్స్ మోడ్ లో 72 kmphకి వేగంతో ప్రయాణించవచ్చు.
ప్యూర్ EV సీఈఓ రోహిత్ వదేరా మాట్లాడుతూ “ఇప్లూటో సిరీస్ కోసం X ప్లాట్‌ఫాం 2.0 (Pure EV X Platform 2.0 ) లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌లను పరిచయం చేయడం ఆనందంగా ఉంది. ఈ మోడల్‌లు ఎలక్ట్రిక్ మొబిలిటీలో కొత్త శకానికి నాంది పలుకుతాయి. ఇవి పవర్-ప్యాక్డ్ యూజర్ ఎక్స్ పీరియన్స్ ను అందిస్తాయి. ఈ కొత్త వేరియంట్ల విడుదల వెనుక గత కొన్ని నెలలుగా మా R&Dలో చాలా కృషి ఉందని తెలిపారు.
“ఈ ఘనత కఠినమైన పరిశోధన, ఆవిష్కరణ ఫలితంగా కొత్త వేరియంట్లలోఅనేక ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ఎకో మోడ్ మెరుగుదలతో, వినియోగదారులు ఇప్పుడు ఆకట్టుకునే మైలేజీని అందుకోవచ్చు. పట్టణాల్లో అధిక వేగంతో దూసుకెళ్తూ ఆనందించవచ్చు అని వివరించారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..