Rambutan Fruit: రాంబుటాన్ ఎరుపు, పసుపు ఆకుపచ్చ రంగులలో మృదువైన ముళ్ళతో ఆకర్షణీయంగా కనిపించే పండు. ఇది ఎరుపు లేదా పసుపు కవచాలను కలిగి గుండ్రంగా ఉంటుంది. రాంబుటాన్ మలేషియా నుండి వచ్చింది. దీని పేరు మలయ్ పదం ‘రంబుట్’ నుండి వచ్చింది.. రంబుట్ అంటే జుట్టు అని అర్థం. రాంబుటాన్ భారతదేశం, మలేషియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్, యునైటెడ్ స్టేట్స్‌లోని కొన్ని తేమతో కూడిన ప్రాంతాలలో బాగా పండుతుంది. రంబుటాన్ శాస్త్రీయ నామం నెఫెలియం లాపాసియం. ఇది సపిండేసి కుటుంబానికి చెందినది. రాంబుటాన్ గుజ్జు, గింజలు, పై తొక్క అనేక బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటాయి. ఇవి ఆహారం, ఔషధాలు, సౌందర్య ఉత్ప్తులు తయారీలో ఉపయోగిస్తారు.
రాంబుటాన్ లో పోషక విలువలు
రాంబుటాన్ విత్తనాలు, పై తొక్క, గుజ్జులో ఎల్లాజిటానిన్స్, జెరానిన్, కొరిలాగిన్, ఎల్లాజిక్ యాసిడ్ వంటి పాలీఫెనాల్స్ వంటి అనేక బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ పండ్లను తినడం వల్ల యాంటీఆక్సిడెంట్ గా, సూక్ష్మజీవుల ఇన్ఫెక్షన్లకు తొలగిస్తుందని పోషకాహార నిపుణులు తేల్చారు. అలాగే వాపులను, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించవచ్చు, క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. రక్తపోటును తగ్గించవచ్చని చెబుతారు.
నిపుణుల అధ్యయనం ప్రకారం.. 2017లో రాంబుటాన్ యాంటీ ఆక్సిడెంట్ కావచ్చని తేలింది. ఇవి శరీరంలో ఉండే హానికరమైన ఎలిమెంట్స్ ను నిష్క్రియం చేయవచ్చు, శరీరాన్ని వివిధ నష్టాల నుండి రక్షిస్తాయి. అలాగే రొమ్ము, ఎముక, గర్భాశయ కాలేయ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా రాంబుటాన్ పనిచేస్తుందని 2020లో తేలింది.
రాంభూటన్ పండులో సి విటమిన్ పెద్ద మొత్తంలో ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రాంభూటన్ పండు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సాయపడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది క్యాన్సర్, వాపు, గుండె జబ్బులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. తినడానికి ఎంతో రుచిగా ఉంటాయి. రాంభూటన్ జీవక్రియకు కూడా సహాయపడుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. ఇంకా బరువు తగ్గడానికి కూడా ఈ పండ్లు సహాయకారిగా పనిచేస్తాయి. ఇది చర్మ వ్యాధులను, రక్తహీనతను కూడా నివారిస్తుందని నిపుణులు చెబుతారు.
Electric Vehicles కి సంబంధించిన అప్ డేట్స్ కోసం హరితమిత్ర పోర్టల్, తాజా వార్తల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను సందర్శించండి..
అలాగే ట్విట్టర్ లోనూ సంప్రదించవచ్చు.