Renewable Energy in 2024 : రికార్డు స్థాయిలో పునరుత్పాదక శక్తి

Renewable Energy in 2024
Spread the love

Renewable Energy in 2024 : మినిస్ట్రీ ఆఫ్ న్యూ & రెన్యూవబుల్ ఎనర్జీ (MNRE) డేటా ప్రకారం, భారతదేశం 2024లో రికార్డు స్థాయిలో 30 GW పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించింది. 2023లో 13.75 GW పున‌రుత్పాద‌క విద్యుత్ ను పెంచుకోగా 2024లో 113% పెరిగింది. ఈ గ‌ణంకాల‌ను బ‌ట్టి క్లీన్ ఎనర్జీ వైపు దేశం వేగవంతంగా ప‌య‌నిస్తున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. 2030 నాటికి భారతదేశం 500 GW పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాల‌ని లక్ష్యంగా పెట్టుకుంది. పున‌రుత్పాద‌క శ‌క్తి ని ప్రోత్స‌హిస్తూ కార్బన్ పాదముద్రను తగ్గించడం, స్థిరమైన భవిష్యత్తును నిర్మించడంలో భారతదేశం వేగంగా అడుగులు వేస్తోంది.

2024లో రెన్యూవబుల్ కెపాసిటీ

భారతదేశం 2024లో రికార్డు స్థాయిలో సుమారు 30 GW పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని జోడించింది, 2023లో సాధించిన 13.75 GW సామర్థ్యంతో పోలిస్తే ఇది 113 శాంతం ఎక్కువ‌.
కాగా భారతదేశంలో మొత్తం పునరుత్పాదక శక్తి సామర్థ్యం ఇప్పుడు దాదాపు 218 GWకి చేరుకుంది.
2030 నాటికి 500 GW కు పెంచాల‌ని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి, వచ్చే ఆరేళ్లలో సంవత్సరానికి సగటున 50 GW జోడించాల్సి ఉంటుంది.

ప్రభుత్వ ప్రయత్నాలు, విధానాలు

Renewable Energy in 2024 | 2023-24లో ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 18.48 GW సాధించింది.
2014లో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పున‌రుత్పాద‌క శ‌క్తిలో దూసుకుపోతోంది.
మార్చి 31, 2014 నాటికి, భారతదేశం కేవ‌లం 35.84 GW పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంది.
2023లో 13.75 గిగావాట్ల నుంచి 2024లో 30 గిగావాట్లకు పెరగడం శుభ‌సూచ‌క‌మ‌ని పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఇటీవ‌ల‌ పేర్కొన్నారు.

BHEL, ONGC మధ్య సహకారం

BHEL (భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్), ONGC (ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్) భారతదేశం గ్రీన్ ఎనర్జీ పరివర్తనను మరింత వేగవంతం చేయడానికి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులపై సహకరించాలని నిర్ణయించుకున్నాయి.


హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *