Sunday, December 8Lend a hand to save the Planet
Shadow

Revolt RV400 BRZ : సింగిల్ చార్జ్ పై 150కి.మీ రేంజ్ తో రివోల్ట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్.. ధర అందుబాటులోనే..

Spread the love

Revolt RV400 BRZ : గుజరాత్‌కు చెందిన రివోల్ట్ మోటార్స్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ తాజాగా RV400 BRZ అనే పేరుతో కొత్త ఎలక్ట్రిక్ బైక్ ను లాంచ్ చేసింది. దీని ఎక్స్ షోరూం ధర (Revolt RV400 BRZ Price) 1.38 లక్షలుగా ఉంది  ఇది తన ఫోర్ట్ పోలియోలో  రెండవ ఎలక్ట్రిక్ బైక్‌.  ఈ Electric Bike  గరిష్టంగా 85km/hr వేగంతో దూసుకుపోతుంది. సింగిల్ చార్జిపై 150km రేంజ్ ను  అందిస్తుంది. అలాగే ఈ బైక్ డార్క్ లూనార్ గ్రీన్, డార్క్ సిల్వర్, కాస్మిక్ బ్లాక్, రెబెల్ రెడ్,  పసిఫిక్ బ్లూ అనే నాలుగు విభిన్న రంగులలో వస్తుంది.

Revolt RV400 BRZ: Performance and Range 

RV400 BRZ 72V, 3.24 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో నడుస్తుంది. ఇందులో మూడు రైడ్ మోడ్‌లు ఉన్నాయి. ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్. ఈ మూడు మోడ్‌లు వరుసగా 150 కి.మీ, 100 కి.మీ, 80 కి.మీల మూడు విభిన్న రేంజ్ ఇస్తాయి. బ్యాటరీ 75 శాతానికి ఛార్జ్ కావడానికి కేవలం మూడు గంటలు పడుతుంది. అయితే పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4 గంటలు పడుతుంది. బ్యాటరీని చార్జ్ చేయడానికి కైనెక్టిక్ శక్తిని ఉపయోగించే రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఇందులో పొందుపరిచారు.

Revolt RV400 BRZ : ఫీచర్లు

వేగం, బ్యాటరీ స్థాయి, రైడింగ్ మోడ్, ఉష్ణోగ్రత, కాంబినేషన్ బ్రేకింగ్ సిస్టమ్, సైడ్-స్టాండ్ పవర్-కట్ గురించి సమాచారాన్ని అందించే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి మరికొన్ని ఫీచర్లను RV400 BRZలో రివోల్ట్ ఇన్‌స్టాల్ చేసింది. RV400 నిగనిగలాడే ఎక్ట్సీరియర్‌తో ఆకట్టుకుంటుంది, సొగసైన, బ్లాక్-అవుట్ అండర్‌బాడీ, లోయర్ ఫెయిరింగ్,  వీల్స్‌తో కూడిన డ్యూయల్-టోన్ కలర్స్ తో రూపొందించింది.

సోలార్ పవర్ రంగంలో ఎన్నో ఉపాధి మార్గాలు.. భారీగా ప్రభుత్వ ప్రోత్సాహకాలు

రట్టన్‌ఇండియా ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్ బిజినెస్ ఛైర్‌పర్సన్ అంజలి రత్తన్ మాట్లాడుతూ, “ రైడర్లకు అధునాత ఫీచర్లు కలిగిన ఆర్‌వి400 బిఆర్‌జెడ్‌  బైక్ అందిస్తున్నం.. ఇది అద్భుతమైన ఇంకా సరసమైన మోటరింగ్ అనుభవాన్ని అందిస్తోంది. ఆధునిక రైడర్ కోసం రూపొందించబడిన, BRZ అనేది మోటార్‌సైక్లింగ్‌ను ఇష్టపడే రైడర్‌ల అవసరాలు,  ప్రాధాన్యతలపై మా లోతైన అధ్యయనం చేయగా వచ్చిన ఫలితం ఇది. రైడర్‌లను ముందుగా ఉంచాలనే మా నిబద్ధత మాకు RV400 BRZని రూపొందించడానికి దారితీసింది. సరసమైన ధరలో ఇంకా ఉల్లాసకరమైన బైకింగ్ అనుభవాన్ని కోరుకునే వారి కోసం ఈ ఎలక్ట్రిక్ బైక్ సరిగ్గా సరిపోతుందని పేర్కొన్నారు.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *