Home » River Indie scooter :  భారీ బూట్ స్పేస్ కలిగిన రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్సింగ్స్ మళ్లీ ఓపెన్..
River Indie electric scooter Price and Specifications

River Indie scooter :  భారీ బూట్ స్పేస్ కలిగిన రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్సింగ్స్ మళ్లీ ఓపెన్..

Spread the love

బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్టార్టప్, రివర్ (River), తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్‌లను మళ్లీ ప్రారంభించింది. ఇది ఇప్పుడు దీని ఎక్స్ షోరూం ధర భారీగా రూ. 13,000 వరకు పెరిగింది. రివర్ ఇండీ ధర ఇప్పుడు రూ. 1.38 లక్షలతో అందుబాటులో ఉంది.    

ఇంతకు ముందు, రివర్ ఇండీ మొదటి బుకింగ్‌లు రూ. 1.25 లక్షలకు, ఎక్స్-షోరూమ్ బెంగళూరులో అందుబాటులో ఉన్నాయి. అయితే గత సంవత్సరం FAME II సబ్సిడీని తగ్గించినందున ఇ-స్కూటర్ ఇప్పుడు ధర పెరిగింది. బెంగళూరులో ఉన్న వినియోగదారులకు కంపెనీ అక్టోబర్ 2023లో 1,000 యూనిట్లను డెలివరీ చేసింది. రూ. 2,500 నామమాత్రపు బుకింగ్ రుసుముతో, ఆసక్తిగల కస్టమర్లు కంపెనీ వెబ్‌సైట్‌లో ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు లేదా బెంగళూరులో కొత్తగా ప్రారంభించిన షోరూమ్‌ని సందర్శించవచ్చు.  

READ MORE  హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ స్పెసిఫికేషన్లు ఇవే..

River Indie electric scooter : డిజైన్ 

రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ ను  ‘స్కూటర్ల SUV’ (The SUV of Scooters) కంపెనీ పేర్కొంది. ఇది ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన బాడీని కలిగి ఉంది. ప్రత్యేకించి ట్విన్-బీమ్ LED హెడ్‌లైట్లు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇండీలో అత్యంత ఆశ్చర్యకరమైన ఫీచర్లతో ఒకటి దాని పుష్కలమైన స్టోరేజ్ కెపాసిటీ. ఇది మీ వస్తువులను ఉంచడానికి 55 లీటర్ల స్థలాన్ని కలిగి ఉంది. సీటు కింద 43 లీటర్లు, గ్లోవ్ కంపార్ట్‌మెంట్‌లో మరో 12 లీటర్ల స్టోరేజ్ ప్లేస్ ఉంటుంది. 

River Indie EV : ఫీచర్లు

ఇక రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే, 26Nm టార్క్ మరియు 4kWh బ్యాటరీ సామర్థ్యంతో పాటు ఇది 6.7 KW బలమైన మోటార్‌తో వస్తుంది. గంటకు 90 kmph గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తుంది. కేవలం 3.9 సెకన్లలోనే 0 నుంచి 40 kmph స్పీడ్‌ను అందుకుంటుంది..

READ MORE  హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ స్పెసిఫికేషన్లు ఇవే..

రివర్‌ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ (Electric Scooter) ఫుల్ ఛార్జింగ్‌పై 120 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది.. అంతేకాకుండా ఈ స్కూటర్‌లో వివిధ రైడింగ్‌ మోడ్‌లను కలిగి ఉంటుంది. రివర్‌ ఇండీ ఇ స్కూటర్‌ను బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 800 పోర్టబుల్ ఛార్జర్‌లను అందిస్తోంది. త్వరలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జర్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఈ స్కూటర్‌లో ఛార్జింగ్ 80% వరకు పొందడానికి 5 గంటలు పడుతుంది. 100%కి 1.5 గంటలు ఎక్కువ అవసరం.

River Indie electric scooter Price : రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ ధర  1.38 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగళూరు)గా నిర్ణయించబడిన  రివర్ ఇండీ దాని పోటీదారులైన Ola S1, Ather 450S, TVS iQube S, బజాజ్ చేతక్ ప్రీమియం వంటి వాటి కంటే ఖరీదైనది. ఇవి ఒకే విధమైన పనితీరు రేంజ్ ను అందిస్తాయి.

READ MORE  హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ స్పెసిఫికేషన్లు ఇవే..

ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Hyundai Creta Electric Specifications detials ఈ ప్రాణాంతకమైన మొక్కలకు దూరంగా ఉండడండి..
Hyundai Creta Electric Specifications detials ఈ ప్రాణాంతకమైన మొక్కలకు దూరంగా ఉండడండి..