రూ.1947తో ప్రీబుకింగ్స్
సింపుల్ ఎనర్జీ, బెంగుళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ గురువారం నుంచి తన ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ Simple One electric scooter కోసం ప్రీ-బుకింగ్స్ ను ప్రారంభించింది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 15 ఆగస్టు, 2021 న ఆవిష్కరించనున్న విషయం తెలిసందే. అయితే ప్రీ బుకింగ్స్ కోసం రూ.1,947 చెల్లించాలని కంపెనీ ప్రకటించింది. ఈ ప్రీ-బుకింగ్ సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభమవుతుంది. వాహనాన్ని కంపెనీ వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. ప్రీ-బుకింగ్ మొత్తం వాపసు చేయబడుతుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయించేటప్పుడు ప్రీ-ఆర్డర్ చేసుకున్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
6కిలోల బ్యాటరీ..
ప్రీబుకింగ్ వివరాలతోపటు సింపుల్ ఎనర్జీ కంపెనీ తన Simple One electric scooter కు సంబంధించి మరికొత సమాచారాన్ని పంచుకుంది. క సింపుల్ ఎనర్జీ స్కూటర్ కోసం బూడిద రంగులో ఉన్న పోర్టబుల్(డిటాచబుల్) బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. బ్యాటరీ ప్యాక్ బరువు 6 కిలోలకు పైగా ఉంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్ భారతీయ వినియోగం కోసం కస్టమ్-బిల్ట్ చేయబడింది, దీనిని వాహనం నుంచి వేరు చేసి ఇంటిలోనే ఛార్జ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.
సింగిల్ చార్జిపై 240కి.మి
Simple One electric scooter ఫీచర్లను గమనిస్తే.. ఇందులో 4.8 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి చార్జి చేస్తే 240 కి.మీ. ప్రయాణించవచ్చు. ఇది టచ్ స్క్రీన్, ఆన్‌బోర్డ్ నావిగేషన్, బ్లూటూత్ మొదలైన స్మార్ట్ ఫీచర్లతో వస్తుంది, ఇ-స్కూటర్ ధర 1,10,000 నుండి 1,20,000 వరకు ఉండవచ్చని అంచనా.
13 రాష్ట్రాలలో విడుదల
మొదటి విడతలో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 13 రాష్ట్రాలలో విడుదల చేయనుంది. ఇందుకోసం తమిళనాడులోని హోసూర్‌లో 2 లక్షల చదరపు అడుగుల కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై సింపుల్ ఎనర్జీ వ్యవస్థాపకుడు మరియు CEO సుహాస్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ, “సింపుల్ వన్ ద్వారా, EV ఇండస్ట్రీలో ఒక బెంచ్‌మార్క్‌ను సృష్టించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 15 కూడా తమకు చారిత్రాత్మకమైన రోజని పేర్కొన్నారు.
👏👏👏👏